బాలానగర్‌లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

బాలానగర్‌లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

Published Sat, Mar 4 2023 3:01 PM

Btech Student Commits Suicide In Balanagar Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బాలానగర్‌లో బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సరిగ్గా చదువుకోవడం లేదంటూ తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెందిన శివప్రసాద్.. ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మృతుడి గదిలో సూసైడ్ నోట్‌, సెల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆత్మహత్యపై బాలానగర్‌ పోలీసులు విచారణ చేపట్టారు.
చదవండి: ‘టీచర్‌ కొట్టడం వల్లే మా బిడ్డ చనిపోయాడు!’

Advertisement
 
Advertisement
 
Advertisement