ఎమ్మెల్యే సోదరుడు మధు అరెస్టు | BRS MLA Mahipal Reddy Brother Arrested For Illegal Mining In Patancheru, Details Inside - Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే సోదరుడు మధు అరెస్టు

Mar 16 2024 5:35 AM | Updated on Mar 16 2024 1:02 PM

BRS MLA Brother Arrested for Illegal Mining in Patancheru - Sakshi

గూడెం మధును తీసుకెళ్తున్న పోలీసులు

అక్రమ మైనింగ్‌ కేసులో రిమాండ్‌

పటాన్‌ చెరు టౌన్, పటాన్‌చెరు: అక్రమ మైనింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి సోద రుడు గూడెం మధుసూదన్‌ రెడ్డిని సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీసులు శుక్రవారం తెలవారుజా మున అరెస్టు చేశారు. పటాన్‌చెరు మండలం లక్డా రం గ్రామంలో మధుసూదన్‌ రెడ్డికి చెందిన సంతోష్‌ సాండ్‌ అండ్‌ గ్రానైట్‌పై వచ్చిన ఆరోపణలపై సంగారెడ్డి ఆర్డీవో ఆధ్వర్యంలోని టాస్క్‌ఫోర్స్‌ తని ఖీలు చేపట్టి అక్రమాలు నిజమేనని తేల్చింది.

దీంతో పటాన్‌చెరు తహసీల్దార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేర కు పోలీసులు 379, 447, 427, 409, 420 ఐపీసీ సెక్షన్‌ 3 పీడీపీపీ యాక్ట్‌ సెక్షన్‌ 21, 23, 4 క్లాస్‌ (1),4 క్లాస్‌ (1)ఏ కేసు నమోదు చేసి శుక్రవారం తెల్లవారుజామున గూడెం మధును అరెస్టు చేశారు. రిమాండ్‌కు తరలించే ముందు ఆయన్ను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు పటాన్‌చెరుకు కాకుండా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరచగా మూడో అదనపు మేజిస్ట్రేట్‌ 14 రోజులపాటు రిమాండ్‌ విధించారు. అనంతరం కందిలోని జిల్లా జైలుకు తరలించారు.

మంత్రి దామోదర ఆదేశాలతోనే అక్రమ కేసులు: ఎమ్మెల్యే హరీశ్‌రావు
ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సోదరుడుమధుసూదన్‌ రెడ్డి అరెస్టును మాజీమంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు ఖండించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం విపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీలో చేరాలి.. లేకుంటే అక్రమ కేసులు నమోదు చేస్తాం’’ అన్న విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. జిల్లాకు చెందిన మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతోనే తమ పార్టీ ఎమ్మెల్యేను టార్గెట్‌ చేస్తున్నారని ఆరోపించారు.

బెదిరింపులకు భయపడం?: ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి  
తాను తప్పు చేస్తే మూడుసార్లు గెలిచేవాడిని కాదని ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి అన్నారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో పదేళ్లలో ఎవరి మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదన్నారు. 2012–13లో అప్పటి కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో పూర్తి అనుమతితోనే క్వారీలను ప్రారంభించామని గుర్తు చేశారు. చట్టపరంగా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని, బెదిరింపులకు భయపడబోమన్నారు. సమావేశంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement