నవ వధువు ఆత్మహత్య | Bride commits suicide | Sakshi
Sakshi News home page

నవ వధువు ఆత్మహత్య

Jun 4 2023 9:44 AM | Updated on Jun 4 2023 9:44 AM

Bride commits suicide - Sakshi

తిరువొత్తియూరు: చైన్నె, పల్లావరంలోని పమ్మల్‌ వఉసి నగర్‌కు చెందిన పసిలెత్తాతూన్‌ గ్రాడ్యుయేట్‌(30). ఈమెకు అదే ప్రాంతానికి చెందిన జమీల్‌ అహ్మద్‌ (36)తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. శుక్రవారం రాత్రి పసిలెత్తాతూన్‌ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కానీ కూతురు మృతిపై పసిలెత్తాతూన్‌ తల్లి హసీనా అనుమానం వ్యక్తం చేసింది.

శంకర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అందులో పసిలెత్తాతూన్‌కు ఐదు నెలల క్రితం 2వ కాన్పులో కూడా కుమార్తె పుట్టడంతో ఆమె భర్త జమీల్‌ అహ్మద్‌, అత్త షకీలా ఆమెను రోజూ తీవ్రంగా కొట్టి హింసించారని ఆరోపించారు. అలాగే జమీల్‌ అహ్మద్‌ తీసుకున్న రూ.20 లక్షల అప్పును తీర్చేందుకు పుట్టింటి నుంచి డబ్బు తేవాలని వేధించారని వాపోయారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement