బెంజ్‌ కారు బీభత్సం: ఒకరు మృతి, ఏడుగురికి గాయాలు

Benz Car Hits To Auto, One Woman Died And 7 Injured - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భాగ్యనగరంలోని హుస్సేన్ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బెంజ్‌ కారు బీభత్సం సృష్టించింది. పాదాచారులపై వేగంగా దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందగా ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన శాలిబండలోని హరిబోలిలో చోటుచేసుకుంది. ఘటన జరిగిన వెంటనే కారులోని వ్యక్తి కారుతో పరారయ్యాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

హరిబోలిలో రోడ్డు పనులు జరుగుతుండడంతో మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో పాదాచారులు రోడ్డుకు అవతల నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ సమయంలో అతి వేగంగా దూసుకొచ్చిన బెంజ్‌ కారు వీరిని ఢీకొట్టుకుంటూ దూసుకెళ్లింది. ఆటోను కూడా ఢీకొట్టింది. ఈ ఘటనలో సలమ్మ అనే మహిళ మృతి చెందగా మరో ఏడుగురు గాయపడ్డారు. ఆటో నుజ్జునజ్జయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. క్షతగాత్రులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా కారును గుర్తించే పనిలో పడ్డారు. బెంజ్ కారు యజమానిపై కేసు నమోదు చేసి శాలిబండ పోలీసులు విచారణ చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top