డేటింగ్‌ యాప్‌లో పరిచయం.. మహిళకు పదే పదే ఫోన్‌ చేసి..

Bengaluru Woman Cheated Nearly 5 Lakhs To Her Tinder Boy Friend Karnataka - Sakshi

బనశంకరి(బెంగళూరు): ఇంటి నుంచి ఉద్యోగం, చవగ్గా వస్తువులు, ఈకేవైసీ పేరుతోనే కాదు ప్రేమ, స్నేహం చాటున సైబర్‌ నేరగాళ్లు జనాన్ని దోచుకుంటున్నారు. బెంగళూరులో ప్రైవేటు కంపెనీలో పనిచేసే 37 ఏళ్ల మహిళ. డేటింగ్‌ యాప్‌లో పరిచయమైన వ్యక్తిని నమ్మి రూ.4.5 లక్షలు మోసపోయింది. వివరాలు.. సుమారు నెలరోజులక్రితం టిండర్‌ యాప్‌లో అద్విక్‌ చోప్రా అనే పేరుతో ఓ వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు.  తనది ముంబై అని, లండన్‌లో మెడిసిన్‌ చదువుతున్నట్లు చెప్పాడు. ఇద్దరి మధ్య చాటింగ్, కాల్స్‌ సాగాయి.

త్వరలో బెంగళూరుకు వచ్చి కలుస్తానని చెప్పాడు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగానని, తన వద్ద పైసా కూడా లేదని, ఖర్చుల కోసం డబ్బులు పంపాలని మోసగాడు ఆ మహిళకు ఫోన్‌ చేశాడు. సరేనని మూడు దఫాసల్లో రూ. 4.5 లక్షలను జమ చేసింది. తరువాత మరో రూ. 6 లక్షలు పంపాలని వంచకుడు డిమాండ్‌ చేయగా, మహిళకు అనుమానం వచ్చింది. అదే విషయమై అతన్ని ప్రశ్నించగా కాల్‌ కట్‌ అయ్యింది. యాప్‌లో ప్రొఫైల్‌ కూడా తొలగించాడు. బాధితురాలు సైబర్‌క్రై ం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

చదవండి: బంగారం గొలుసు కొట్టేసి.. కాపాడమని పోలీసులను వేడుకున్న దొంగ!

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top