డీజే బంద్‌ చేయమన్నందుకు పోలీసులపైనే దాడి..

Attack On Police Offecers And Damaged Vehicles Issue In Nalgonda - Sakshi

సాక్షి, డిండి(నల్లగొండ) : ఓ వివాహ వేడుకలో డీజే సౌండ్‌ను బంద్‌ చేయాలని చెప్పినందుకు పలువురు వ్యక్తులు పోలీసులపై దాడి చేశారు. ఈ సంఘటన సోమవారం రాత్రి మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. దేవరకొండ నియోజకవర్గంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో మండలంలో లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా మండల పరిధిలోని చెర్కుపల్లి సమీపంలోనున్న గ్రామాలకు పోలీసులు పర్యవేక్షణకు వెళ్తున్న క్రమంలో డీప్‌కట్‌ సమీపంలోకి వెళ్లగానే డీజే సాంగ్స్, కేరింతలు వినిపించాయి. బురాన్‌పూర్‌తండాకు చెందిన కట్రావత్‌  శ్రీకాంత్‌ వివాహ వేడుకల్లో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకుగాను డీజే సౌండ్‌ బాక్స్, ఆంప్లిఫైర్‌ను పోలీసు వాహనంలో వేశారు. దీంతో ఆగ్రహించిన మూడావత్‌ మల్లేష్, మూడావత్‌ బాలు, కాట్రావత్‌ భాస్కర్‌మూడావత్‌ జగన్, వడ్త్య రాము, కట్రావత్‌ బుజ్జి పోలీసులపై దాడికి దిగారు.

పోలీసు వాహనం ధ్వంసం కావడంతోపాటు పీఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న కళ్యాణ్‌కుమార్‌కు గాయాలయ్యాయి. మంగళవారం డిండి రూరల్‌ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ.శోభన్‌బాబు, పోలీసులు బురాన్‌పూర్‌కు చేరుకొని దాడికి పాల్పడిన వారిని అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని ఎస్పీ రంగనాథ్‌ ఆదేశాల మేరకు వారిని నల్లగొండకు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.   

చదవండి: వాహనదారులకు చుక్కలే, మరోసారి పెరిగిన పెట్రోల్‌ ధర 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top