
గువాహటి: బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేసే అన్సరుల్ ఇస్లామ్ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన 12 మంది జిహాదీలను అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న మరో ఏడుగురిని కూడా గురువారం అదుపులోకి తీసుకున్నారు.
ఇతర రాష్ట్రాల సహకారంతో చేపట్టిన ఈ ఆపరేషన్‌తో రెండు ప్రధాన ఉగ్ర మాడ్యూల్‌లను పట్టుకున్నట్లు సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ప్రధానంగా బార్పేట, మోరిగావ్ జిల్లాల్లో చేపట్టిన దాడుల్లో చిక్కిన వీరిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం(ఉపా)కింద కేసులు నమోదు చేశామన్నారు.