ఏసీబీ కోర్టులో లొంగిపోయిన ప్రమోద్‌రెడ్డి

AP ESI Scam: Pramod Reddy surrenders In ACB Court - Sakshi

సాక్షి, అమరావతి : ఈఎస్‌ఐ స్కాం నిందితుడు ప్రమోద్‌రెడ్డి గురువారం ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. రూ.150 కోట్ల ఈఎస్‌ఐ స్కాంలో ఏ3 నిందితుడిగా ఉన్న ప్రమోద్‌రెడ్డి గత కొద్ది రోజులుగా ఏసీబీ అధికారులకు చిక్కకుండా తప్పించుకుతిరుగుతున్నారు. మాజీమంత్రి అచ్చెన్నాయుడు ఇచ్చిన సిఫారసు లేఖలతో అప్పటి డైరెక్టర్‌ రమేష్‌, ప్రదీప్‌రెడ్డితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈసీజీ, కాల్‌ సెంటర్‌ సర్వీసెస్‌ నడపకుండానే రూ.7.96 కోట్లు బిల్లు తీసుకున్నట్లు ఏసీబీ విచారణలో తేలింది. 

విచారణ నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే ఏసీబీ అధికారులు గాలింపు ముమ్మరం చేయడంతో కోర్టులో లొంగిపోయారు. ప్రమోద్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో ఏసీబీ అధికారులు అతన్ని మచిలీపట్నం సబ్‌ జైలుకు తరలించారు. కాగా, మందుల కొనుగోలు గోల్‌మాల్‌లో ప్రమోద్‌రెడ్డి ప్రమేయం ఉన్నట్లు ఏసీబీ నిగ్గులేల్చిన విషయం తెలిసిందే.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top