ప్రేమికులపై దాడి ఘటన హేయం: గౌతం సవాంగ్‌

AP DGP Gautam Sawang Over Lovers Attacked At Guntur Tadepalli - Sakshi

సాక్షి, అమరావతి: తాడేపల్లి పరిధిలోని సీతానగరంలో జరిగిన ప్రేమికులపై దాడి ఘటనపై ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ స్పందించారు. ఈ దాడి అత్యంత హేయం, బాధాకరం అన్నారు. బాధ్యులైన నిందితులను పట్టుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా ఇప్పటికే కృష్ణ, గుంటూరు జిల్లా ఎస్పీలు, విజయవాడ కమిషనర్‌లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఇటువంటి అమానవీయ చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని గౌతమ్‌ సవాంగ్‌ స్పష్టం చేశారు.

నేరానికి పాల్పడిన నిందితులు ఎంతటివారైనా ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే ప్రసక్తి లేదని తెలిపారు గౌతమ్‌ సవాంగ్‌. మహిళల భద్రత మా ప్రథమ కర్తవ్యం. ఎన్నో చర్యలు చేపట్టినా, ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరం అన్నారు. ప్రతి మహిళ దిశ యాప్‌ను ఖచ్చితంగా వాడాలని గౌతమ్‌ సవాంగ్‌ సూచించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top