కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య

Published Thu, Aug 17 2023 4:00 AM

Another student dies by suicide in coaching hub Kota - Sakshi

కోటా: రాజస్థాన్‌లో కోచింగ్‌ సెంటర్‌ హబ్‌గా పేరు పొందిన కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బిహార్‌లోని గయకు చెందిన 18 ఏళ్ల వయసున్న వాలీ్మకి ప్రసాద్‌ మంగళవారం రాత్రి అద్దెకి ఉంటున్న ఇంట్లో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. వాలీ్మకి పక్క గదిలోనే ఉంటున్న విద్యార్థులు రాత్రి అతని తలుపు కొడితే తియ్యకపోయే సరికి అనుమానం వచ్చి ఇంటి యజమానికి చెప్పారు. తలుపులు బద్దలు కొట్టి చూడగా అతను శవమై కనిపించాడు.

వెంటనే వారంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంజనీరింగ్‌ ఎంట్రన్స్‌ పరీక్షల కోసం ప్రిపేర్‌ అవుతున్న వాలీ్మకి రెండేళ్లుగా కోటాలోనే ఉంటున్నాడు. కోటాలో విద్యార్థి ఆత్మహత్యల్లో ఈ నెలలో ఇది నాలుగోది. ఇక ఈ ఏడాది ఇప్పటివరకు 20 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. నిరుపేద కుటుంబాల నుంచి పిల్లలు చదువుల ఒత్తిడి తట్టుకోలేకపోవడమో, తల్లిదండ్రులు చేసిన అప్పు వేధిస్తూ ఉండడంతో ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయన్న అంచనాలున్నాయి. విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉండడంతో జిల్లా యంత్రాంగం ఆందోళన చెందుతోంది. ప్రతీ విద్యారి్థకి సైక్రియాటిస్ట్‌తో కౌన్సెలింగ్‌ ఇప్పించడానికి సన్నాహాలు చేస్తోంది.  

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

Advertisement

తప్పక చదవండి

Advertisement