బాలికను కిడ్నాప్‌ చేసి లైంగిక దాడికి పాల్పడ్డ యువకుడికి 20 ఏళ్లు జైలు | 20 years jail sentence for Molestation Attack On Girl | Sakshi
Sakshi News home page

బాలికను కిడ్నాప్‌ చేసి లైంగిక దాడికి పాల్పడ్డ యువకుడికి 20 ఏళ్లు జైలు

Nov 9 2021 4:11 AM | Updated on Nov 9 2021 4:11 AM

20 years jail sentence for Molestation Attack On Girl - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

పెదకాకాని(పొన్నూరు): బాలికను కిడ్నాప్‌ చేసి, లైంగిక దాడికి పాల్పడిన యువకుడికి సోమవారం కోర్టు 20 ఏళ్లు జైలు శిక్ష విధించింది. పెదకాకాని పోలీసుల కథనం ప్రకారం.. పెదకాకాని ప్రాంతానికి చెందిన బాలిక 8వ తరగతి చదువుతోంది. పాఠశాలకు వెళుతున్న ఆ బాలికకు ఆటో డ్రైవర్‌ సాగర్‌బాబు మాయ మాటలు చెప్పి 2015 డిసెంబర్‌ 15న ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్లాడు. బాలిక ఇంటికి రాకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నిందితుడు సాగర్‌బాబుతో పాటు అతడికి సహకరించిన వేల్పుల కిషోర్‌బాబు, కొండేటి శ్రీనివాసరావు, రాణిలపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. బాలికపై ఆటోడ్రైవర్‌ లైంగిక దాడి చేసినట్టు నిర్ధారణ కావడంతో నిందితుడు సాగర్‌బాబుకు గుంటూరులోని పోక్సో ప్రత్యేక కోర్టు జడ్జి ఆర్‌.శ్రీలత.. 20 ఏళ్లు జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్టు పోలీసులు చెప్పారు. మిగిలిన ముగ్గురిపై నేరం రుజువు కానందున వారిపై కేసు కొట్టేసినట్టు తెలిపారు. కేసులో పీపీగా శ్యామల వాదనలు వినిపించారు.    

Advertisement
 
Advertisement
Advertisement