బాలుడిపై లైంగిక దాడి కేసులో 20 ఏళ్లు జైలు

విజయవాడ స్పోర్ట్స్: బాలుడిపై లైంగిక దాడి చేసిన వ్యక్తికి 20 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధిస్తూ విజయవాడ ఫోక్సో కోర్టు(స్పీడ్ ట్రయిల్ కోర్టు) న్యాయమూర్తి డాక్టర్ ఎస్.రజిని బుధవారం తీర్పు ఇచ్చారు. విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన 11 ఏళ్ల బాలుడిపై అదే ప్రాంతానికి చెందిన యువకుడు పతకమూరి కాంతారావు(20) 2018, జూన్ 30వ తేదీన లైంగిక దాడి చేశాడు.
బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫోక్సో కేసు నమోదు చేసి వెంటనే చార్జ్‌షీట్ దాఖలు చేశారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జీవీ నారాయణరెడ్డి బాధితుడి తరఫున వాదించి 11 మంది సాక్షులను విచారణ చేశారు. నేరం రుజువు కావడంతో పతకమూరి కాంతారావుకు 20ఏళ్లు జైలు శిక్షతోపాటు రూ.20 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. బాధితుడికి రూ.5 లక్షలు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు.