– 8లో
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
పంచాయతీ పోరులో..
అధికార పార్టీ అరాచకాలు
వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై దాడులు
నామినేషన్ పత్రాలు చించివేస్తూ.. ఫోన్లలో బెదిరింపులు
మున్సిపల్.. పరిషత్ ఎన్నికల ఫార్ములానే అమలు
ఖాకీల మౌనం..
పచ్చమూక స్వైర విహారం
ముగిసిన తొలి విడత.. నేటి నుంచి రెండో విడత నామినేషన్ పర్వం
‘ఫీజు’లుం.. విచారణ అవసరం
ఎస్వీ సెట్ ఇంజినీరింగ్ కళాశాల లో అక్రమ ఫీజుల వసూలుపై విచారణ అవసరమని ఏఐఎస్‌ఎఫ్ నేతలు కోరారు.
నేడు టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ సమావేశం
తిరుమలలో నూతనంగా నియమించబడిన స్పెసిఫైడ్ అథారిటీ బుధవారం తొలిసారిగా సమావేశం కానుంది.
బుధవారం శ్రీ 18 శ్రీ నవంబర్ శ్రీ 2026
కుప్పంలోని కంగుంది వద్ద టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడ్డ వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడైన అభ్యర్థి
కుప్పం మండలంలోని నాయనూరు, మహమూద్‌పురం పంచాయతీల్లో వార్డు మెంబర్లుగా నామినేషన్లు దాఖలు చేయడానికి వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు మంగళవారం కంగుందికి వెళ్లారు. అప్పటికే కుప్పం నుంచి వచ్చి కాపుగాసిన పచ్చ మూకలు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల తలలు పగులగొట్టి.. రక్తపాతం సృష్టించారు. చివరకు వారు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారు. రామకుప్పం మండలం బందార్లపల్లె పంచాయతీలోని నాలుగో వార్డుకు వైఎస్సార్‌సీపీ మద్దతుతో కవిత నామినేషన్ దాఖలు చేశారు. వెంటనే ఆమె భర్త సుబ్రమణ్యానికి ఫోన్ చేసిన టీడీపీ గూండాలు బెదిరింపులకు దిగారు. ‘‘రేయ్ సుబ్రమణ్యం. ఎవరిని అడిగి నామినేషన్ వేశావు రా. నీకు ఎంత ధైర్యం ఉంటే వైఎస్సార్‌సీపీ మద్దతుతో నామినేషన్ వేస్తావు..? అసలు ప్రచారానికి మా ఊళ్లో అడుగు పెట్టగలవా..? గంటలో నువ్వు నామినేషన్ వెనక్కు తీసుకోవాలి. లేకుంటే నీ చావు ఖాయం. నిన్ను ఏ వైఎస్సార్‌సీపీ వాడు వచ్చి కాపాడుతాడో చూస్తాం. నా కొడకా..’’ అంటూ పత్రికల్లో రాయలేని బూతులతో రెచ్చిపోయారు. తాను ఆస్పత్రికి వచ్చానని చెబుతున్నా, ఒకరి తర్వాత ఒకరు ఫోన్లో సుబ్రమణ్యాన్ని తీవ్రంగా బెదిరింపులకు గురిచేశారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. రాష్ట్రం మొత్తం ఏలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా జరుగుతున్నది పారదర్శక ఎన్నికలంటూ చెప్పడం అధికారపార్టీ నేతల నిస్సిగ్గుకు పరాకాష్ట.
‘ఆర్మన్’ కింద ఏఎన్‌ఎంలకు శిక్షణ
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో వైద్య, ఆరోగ్య రంగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా వైద్యాధికారులు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆర్మన్ కార్యక్రమం కింద ఏఎన్‌ఎంలకు ఇస్తున్న శిక్షణ మంగళవారం రెండో రోజుకు చేరింది. క్షేత్రస్థాయిలో సిబ్బంది ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా ఈ శిక్షణలో పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. జిల్లా టీబీ, లెప్రసీ, ఎయిడ్స్ నివారణ అధికారి డాక్టర్ వెంకటప్రసాద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఏఎన్‌ఎంలకు విపులంగా రీఓరియంటేషన్ శిక్షణ ఇచ్చారు. ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్ నినాదానికి అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టతనిచ్చారు. హైరిస్క్ ఏరియాల్లో ఎక్స్‌రేల నిర్వహణ, స్పర్శ లేని మచ్చలు ఉన్నవారిని గుర్తించడం, అనుమానిత కేసులను వెంటనే వైద్యుల వద్దకు రెఫర్ చేసే విధానాలను వివరించారు. అలాగే హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి సిబ్బందిపై ఉందని గుర్తుచేశారు. ఈ వ్యాధులు సమాజంలో పూర్తిగా తగ్గుముఖం పట్టేలా సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
నేటి నుంచి రెండో విడత నామినేషన్లు
చిత్తూరు కార్పొరేషన్ : పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రెండో విడత నామినేషన్ ప్రక్రియ బుధవారం నుంచి మొదలుకానుంది. ఈ నెల 20వ తేదీవరకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 21 ఉదయం 8 గంటల నుంచి పరిశీలన, 22న అప్పీల్, 23 అప్పీల్ పరిశీలన, 24వరకు ఉపసంహరణ గడువు, తుది జాబితా ప్రకటన, 29న ఎన్నికలు, విజేతల ప్రకటన ఉంటుంది. పూతలపట్టు, యాదమరి, ఐరాల, బంగారుపాళ్యం, తవణంపల్లె, పులిచెర్ల, రొంపిచెర్ల, నగరి, విజయపురం, నిండ్ర మండలాల్లో రెండో విడత కింద ఎన్నికలు నిర్వహణకు అధికారులు సమయాత్తమయ్యారు. మొత్తం 10 మండలాల్లో 253 పంచాయతీలు, 2,282 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటి కోసం 57 నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పురుష ఓటర్లు 1,67,160, మహిళ ఓటర్లు 1,74,246 మంది కలిపి మొత్తం 3,41,406 మంది ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా బంగారుపాళ్యంలో 41 పంచాయతీలు, అత్యల్పంగా రొంపిచెర్లలో 11 పంచాయతీలు ఉన్నాయి. బంగారుపాళ్యంలో 376, రొంపిచెర్లలో 104 వార్డులున్నాయి. మొత్తం 2,285 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
రేపటి నుంచి డిగ్రీ స్పాట్ అడ్మిషన్లు
తిరుపతి సిటీ: డిగ్రీ కళాశాలల్లో పలు యూజీ కోర్సుల్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీ కోసం ఓఏఎమ్‌డీసీ కన్వీనర్ స్పాట్ అడ్మిషన్లకు అనుమతినిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. గురువారం నుంచి ఈనెల 22వ తేదీ వరకు ఆయ కళాశాలల్లో గత మూడు విడతల కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత మిగిలి ఉన్న సీట్ల కోసం స్పాట్ అడ్మిషన్లకు ఆసక్తిగల విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. ఈనెల 23న సీట్లు పొందిన అభ్యర్థుల లిస్ట్ విడుదల చేసి ప్రవేశాలు కల్పించనున్నారు. వచ్చే నెల 4వ తేదీలోపు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తిచేసి 5వ తేదీన ఓఏఎమ్‌డీసీ పోర్టల్ మూసివేయనున్నారు.
ప్రశాంత పల్లెలను పచ్చమూక రక్తసిక్తం చేస్తోంది. పంచాయతీ ఎన్నికలను ఏకపక్షం చేసుకునేందుకు అరాచకాలు తెగబడుతోంది. వైఎస్సార్‌సీపీ
మద్దతుదారులపై ఇష్టారాజ్యంగా దాడులకు పాల్పడుతోంది. దౌర్జన్యంగా నామినేషన్ పత్రాలను లాక్కుని చించివేస్తోంది. ప్రశ్నించిన వారిని అక్రమ కేసుల పేరుతో బెదిరించి లొంగదీసుకునేందుకు యత్నిస్తోంది. ఆగడాలకు భయపడకుండా బరిలో దిగేందుకు వచ్చిన అభ్యర్థుల తలలు పగులగొట్టి రక్తం కళ్లజూస్తోంది. ప్రతిపక్ష పార్టీ అండతో పోటీకి సిద్ధమైన నేతలే లక్ష్యంగా హత్యాయత్నాలకు సైతం దిగజారుతోంది.
కుప్పం : పంచాయతీ ఎన్నికల నామినేషన్లలో టీడీపీ గూండాలు అరాచకాలు, దాడులకు పాల్పడడం దారుణమని ఎమ్మెల్సీ భరత్ మండిపడ్డారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గంలో ప్రజాస్వామ్యం ఖూనీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పంచాయతీ ఎన్నికలైనా ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తారని ఆశించామని, అయితే పచ్చమూక అప్రజాస్వామికంగానే వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా స్థానిక నాయకత్వాన్ని ఎంపిక చేసుకునే ఈ ఎన్నికల్లో సైతం బయటి ప్రాంతాల నుంచి రౌడీలను తీసుకువచ్చి గ్రామీణులపై దాడులు చేయడం హేయమని విమర్శించారు. అభివృద్ధి చేశామంటూ ఊదరగొట్టుకునేవారికి ఎన్నికలంటే ఎందుకు భయమని ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేకత బయటపడకుండా ఉండేందుకే వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పుడు చేసే ప్రతి దాడికీ భవిష్యత్‌లో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పార్టీ మండల కన్వీనర్ హెచ్ ఎం మురుగేష్, జీవీరమేష్ పాల్గొన్నారు.
సాక్షి, చిత్తూరు : మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు పచ్చరౌడీలు చించివేశారు. అభ్యర్థులు, ప్రతిపాదకులు రాకనే ఫోర్జరీ సంతకాలతో టీడీపీ అభ్యర్థులను ఏకగ్రీవం చేసేశారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో నామినేషన్ కేంద్రం వద్దే కాపుగాచి గూండాగిరీ చేసి.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల తలలు పగులగొట్టారు. అవే నీతిమాలిన పనులను పచ్చమూక.. పంచాయతీ ఎన్నికల్లోనూ చేపడుతోంది. వైఎస్సార్‌సీపీ మద్దతుతో బరిలో దిగే అభ్యర్థులపై దాడులు చేస్తూ, పల్లె సీమలను రక్తసిక్తం చేస్తోంది. ప్రశాంతమైన గ్రామాల్లో భయాందోళనలు సృష్టిస్తోంది.
అంతటా బెదిరింపులు
తొలి విడల పల్లెపోరుకు సంబంధించి మంగళవారంతో నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తయ్యింది. రెండో విడత నామినేషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఇందులో పూతలపట్టు, నగరి నియోజకవర్గాలతో పాటు పాటు రొంపిచెర్ల, పులిచెర్ల మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. యాదమరి మండల కేంద్రం, మాదిరెడ్డిపల్లెలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు నామినేషన్లు వేయకుండా.. టీడీపీ మూకలు ఇప్పటి నుంచే బెదిరింపులకు దిగుతున్నారు. ఐరాలలో వైఎస్సార్‌సీపీ మద్దతుతో నామినేషన్ వేస్తే మద్యం కేసులు పెట్టిస్తామని.. తవణంపల్లెలో పట్నం, తెల్లగుండ్లపల్లె, పట్నం, దిగువమాఘం, తవణంపల్లె, ఇరువారంపల్లె, మద్దిపట్ల పంచాయతీల్లోనూ వైఎస్సార్‌సీపీ అండతో నామినేషన్ వేస్తే చించివేస్తామని టీడీపీ గూండాలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బంగారుపాళ్యంలోని తగ్గువారిపల్లె, రాగిమానుపెంట, పాలేరు పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులైన అభ్యర్థులను ఫోన్లలో అసభ్యంగా దూషిస్తూ మానసికంగా వేధిస్తున్నారు. నామినేషన్ వెనక్కు తీసుకోవాలని హుంకరిస్తున్నారు.
పచ్చమూక చించివేసిన నామినేషన్ పత్రాలను చూపుతున్న పెద్దపంజాణి సర్పంచ్ అభ్యర్థి
బాబు పాలనలో వ్యవస్థలు నిర్వీర్యం
● అధినేతతో ఆత్మీయ భేటీ
వెదురుకుప్పం : చంద్రబాబు పాలనతో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని, రెడ్‌బుక్ పేరుతో టీడీపీ గూండాలు పేట్రేగిపోతున్నారని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి విమర్శించారు. మంగళవారం మండలంలోని జీటీ కండ్రిగ వద్ద ఓ కన్వెన్షన్ సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. నారాయణస్వామి మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు గాలికొదిలేశారని ఆరోపించారు. ప్రజా వ్యతిరేకత కారణంగా ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, సానుభూతిపరులపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోకేవలం చంద్రబాబు కోసం ఎన్నికల సంఘం పనిచేస్తుందనే అనుమానం వ్యక్తం చేశారు. విచ్చలవిడిగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నట్లు ఆధారాలు, వీడియోలు చూపిస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకుడా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాలు, దారుణాలపై తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీఐ విచారణ చేయిస్తామని స్పష్టం చేశారు. అధికార పార్టీ నేతల చేతిలో పోలీసులు కీలుబొమ్మలుగా మారడం దారుణమని మండిపడ్డారు. చట్టం ఉల్లంఘించిన అధికారులపై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. చంద్రబాబు పాలనలో రైతుల కన్నీళ్లు తప్పడం లేదని వెల్లడించారు. . పెనుమూరులో కలవకుంట జలాశయం అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. వెదురుకుప్పంలో డిగ్రీ కళాశాల నిర్మాణం కలగానే మార్చేశారని ఆవేదన వ్య్తం చేశారు. వైఎస్సార్ డిగ్రీ కళాశాలగా పేరు ఉండడంతోనే చంద్రబాబు నిధులు విడుదల చేయడం లేదని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ కామసాని పద్మనాభరెడ్డి పాల్గొన్నారు.
కుప్పంలో దాడులు
పలమనేరులో ఆగడాలు
పలమనేరు నియోజకవర్గంలో టీడీపీ మూకలు రెచ్చిపోతున్నా పోలీసులు మౌనం వీడడం లేదు. పెద్ద పంజాణి మండలంలోని రాయలపేట పంచాయతీకి వైఎస్సార్‌సీపీ మద్దతుదారు హేమచంద్ర సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి వెళితే, అక్కడే కాపుగాచిన టీడీపీ గూండాలు నామినేషన్ పత్రాలను చింపేశారు. పోలీసులు ఏ మాత్రం వీళ్లను నిలువరించే ప్రయత్నం చేయలేదు. అలాగే కొలమాసనపల్లెలోని 7 వార్డుకు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు, తన ప్రతిపాదకుడితో వెళ్లి నామినేషన్‌ను అధికారులకు అందజేశారు. దీనికి సంబంధించి రుసుము చెల్లించి, రశీదు సైతం తీసుకున్నారు. అధికారుల చేతిలో ఉన్న నామినేషన్ పత్రాలను టీడీపీ మూకలు లాక్కుని వెళ్లిపోయారు. దీంతో అభ్యర్థి వద్ద కట్టించుకున్న డబ్బులను అధికారులు వాపసు చేశారు. ఇదేం పద్దతని అభ్యర్థి అడిగినా.. పట్టించుకోలేదు. దీనిపై ఆర్‌డీఓ, పోలీసులకు చెప్పినా ఫలితం లేదు.


