విజనరీ.. ఏదీ స్టేషనరీ! | - | Sakshi
Sakshi News home page

విజనరీ.. ఏదీ స్టేషనరీ!

Nov 18 2026 12:38 AM | Updated on Nov 18 2026 12:38 AM

● సచివాలయాల్లో స్టేషనరీ కొరత! ● కంప్యూటర్‌లున్నాయ్‌, కాగితాలే లేవు ● సర్టిఫికెట్లు అందక అభ్యర్థుల ఆందోళన ● పట్టించుకోని జిల్లా అధికారులు ● హోరాహోరీగా దాఖలాలు ● మూడురోజుల్లో 5,031 నామినేషన్లు

ముగిసిన తొలిదశ నామినేషన్లు

చిత్తూరు కార్పొరేషన్‌: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి దశ నామినేషన్‌ దాఖలు చేయడానికి మంగళవారంతో గడువు ముగిసింది. రోజువారీగా నామినేషన్లను అధిక సంఖ్యలో ఆశావహులు దరఖాస్తు చేశారు. పలమనేరు, కుప్పం నియోజకవర్గాల పరిధిలోని 9 మండలాల్లో 182 సర్పంచ్‌, 1908 వార్డు సభ్యుల స్థానాలున్నాయి. వీటి కోసం మొత్తం మూడు రోజులకు గాను సర్పంచ్‌ స్థానాలకు 1,345 వార్డు సభ్యుల స్థానాలకు 3,686 నామినేషన్లు దాఖలు చేశారు. చివరిరోజు సర్పంచ్‌ స్థానాలకు 556 వార్డు సభ్యుల స్థానాలకు 1,750 నామినేషన్లు వేశారు.

పోటాపోటీగా..

జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం చివరి రోజు పోటాపోటీగా సాగింది. కుప్పం, పలమనేరు రెవెన్యూ డివిజన్లలోని 9 మండలాల్లో నిర్వహిస్తున్న ఎన్నికల నామినేషన్ల పర్వంలో అభ్యర్థులు అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. ఈనెల 15న ప్రారంభమైన తొలి దశ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. మొదటి రెండు రోజులతో పోలిస్తే చివరి రోజు పెద్దసంఖ్యలో నామినేషన్లు వేశారు. తొలిరోజు సర్పంచ్‌ స్థానాలకు 178 నామినేషన్లు దాఖలు కాగా, రెండో రోజు సోమవారం 611 నామినేషన్లు, మూడు రోజు 556 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే, వార్డు సభ్యుల పదవులకు మొదటి రోజు 248 నామినేషన్లు రాగా, రెండో రోజు ఆ సంఖ్య 1,688, మూడో రోజు 1,750 నామినేషన్లు వేశారు.

చిత్తూరు కలెక్టరేట్‌ : ‘విజనరీ’ పాలన అందిస్తున్నామని, సాంకేతికతను పరుగులు పెట్టిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు పాలనలో గ్రామ, వార్డు సచివాలయాలకు కనీస స్టేషనరీ సైతం కరువైంది. ప్రజలకు ఇంటి వద్దకే పౌర సేవలు అందించేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థను కూటమి వచ్చిన తర్వాత పూర్తిగా నిర్వీర్యమైంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 612 సచివాలయాలు ఉన్నాయి. ప్రస్తుతం వీటిలోని మెజారిటీ సచివాలయాల్లో కనీసం సర్టిఫికెట్లు ప్రింట్‌ తీయడానికి ఏ4 పేపర్లు, ప్రింటర్‌ ఇంక్‌, వివిధ సర్టిఫికెట్‌ల ప్రింటెడ్‌ పేపర్‌లు, ఇతర స్టేషనరీ లేకపోవడంతో పాలన అస్తవ్యస్తంగా మారింది.

ఎన్నికల వేళ అభ్యర్థులకు తిప్పలు

ఒకవైపు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగడంతో ఆశావహులు, పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ల దాఖలు కోసం కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలతో పాటు ఇతర కీలక సర్టిఫికెట్ల కోసం సచివాలయాలకు పరుగులు తీస్తున్నారు. తీరా అక్కడ కంప్యూటర్లలో సర్టిఫికెట్‌లు సిద్ధంగా ఉన్నప్పటికీ, వాటిని ప్రింట్‌ తీసి ఇవ్వడానికి కనీసం హై సెక్యురిటీ ప్రింటెడ్‌ పేపర్‌లు లేవంటూ సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. ‘మా దగ్గర పేపర్లు లేవు.. పేపర్‌లు వచ్చాక ప్రింట్‌ ఇస్తాం, లేదంటే తర్వాత రండి’ అంటూ అభ్యర్థులు, సామాన్య ప్రజలను వెనక్కి పంపుతున్నారు. అత్యవసర పనులకు వచ్చే ప్రజలు సచివాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన దుస్థితి దాపురించింది.

పట్టించుకోని ఉన్నతాధికారులు

కొన్ని నెలలుగా సచివాలయాలకు స్టేషనరీ నిధులు విడుదల కాకపోవడంతో ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటివరకు చాలామంది సచివాలయ సిబ్బంది తమ సొంత జేబుల నుంచే డబ్బులు ఖర్చు చేసి పేపర్లు, పెన్నులు, రిజిస్టర్లు కొనుగోలు చేస్తూ నెట్టుకొచ్చారు. కానీ, నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో ఇక తాము భరించలేమంటూ వారు కూడా చేతులెత్తేశారు. సచివాలయాల్లో స్టేషనరీ కొరతపై కిందిస్థాయి ఉద్యోగులు పలుమార్లు ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు, జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. అధికారుల నుంచి కనీస స్పందన లేకపోవడంతో సేవలు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి.

శ్రీవారి దర్శనానికి 15 గంటలు

తిరుమల:తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ సా ధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్‌ కృష్ణ తేజ అతిథి గృహం వద్దకు చేరింది. సోమవారం అర్ధరాత్రి వరకు 68,498 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 26,977 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకలరూపంలో హుండీలో రూ.4.08 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కె ట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.

కుప్పం డివిజన్‌లోనే అధికం

కుప్పం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని నాలుగు మండలాల్లో (92 పంచాయతీలు, 952 వార్డులు) నామినేషన్లు అధికంగా నమోదయ్యాయి. పలమనేరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని ఐదు మండలాల్లో (90 పంచాయతీలు, 956 వార్డులు) సైతం అభ్యర్థులు ఉత్సాహంగా నామినేషన్లు వేశారు. ఈ డివిజన్‌లో పెద్దపంజాణి మండలం సర్పంచ్‌ నామినేషన్‌ , వి.కోట మండలం వార్డు నామినేషన్లలో ముందున్నాయి.

ప్రజలకు పారదర్శకంగా ప్రభుత్వ సేవలను అందించాలనే ఉద్దేశంతో గత వైఎస్సార్‌సీపీ సర్కారు సచివాలయాలను ఏర్పాటు చేసింది. కుల, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాలతో పాటు వివిధ ప్రభుత్వ పథకాల దరఖాస్తులు, సర్టిఫికెట్‌లను సులభతరంగా అందజేసింది. అయితే ప్రస్తుతం జిల్లాలోని మెజారిటీ సచివాలయాల్లో కనీసం సర్టిఫికెట్‌లను ప్రింట్‌ తీసేందుకు అవసరమైన హైసెక్యురిటీ పేపర్లు, ప్రింటర్లు, రిజిస్టర్లు, ఇతర స్టేషనరీ కరువైంది. ఈ మేరకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడమే ఈ దుస్థితికి ప్రధాన కారణమని తెలుస్తోంది. దీంతో విజనరీ చంద్రబాబు పాలనలోని డొల్లతనం బయటపడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement