జిల్లాకు తుపాన్‌ గండం! | - | Sakshi
Sakshi News home page

జిల్లాకు తుపాన్‌ గండం!

Oct 26 2026 2:22 AM | Updated on Oct 26 2026 2:22 AM

● వీడని ముసురు.. ఉదయం నుంచి విరామం లేని వర్షం ● జలమయమైన రోడ్లు, పొంగిపొర్లుతున్న కాలువలు ● నేడు కూడా భారీ వర్ష సూచన

● వీడని ముసురు.. ఉదయం నుంచి విరామం లేని వర్షం ● జలమయమైన రోడ్లు, పొంగిపొర్లుతున్న కాలువలు ● నేడు కూడా భారీ వర్ష సూచన

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ముసురు వాతావరణం అలుముకుంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో చిత్తూరు నగరంతో పాటు కుప్పం, పలమనేరు, నగరి తదితర ప్రాంతాల్లో పలు ప్రధాన వీధులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాలువలు పొంగిపొర్లుతున్నాయి. వర్షపు నీరు చెరువులు, కుంటలు, వాగులు, వంకల్లోకి వచ్చి చేరుతోంది. రోజంతా వర్షం కురుస్తుండటంతో జనం బయటకు రాకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. వ్యాపార సముదాయాలు, ప్రధాన కూడళ్లు వెలవెలబోయాయి. వర్షం కారణంగా నిత్యవసరాల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తుపాను ప్రభావంతో సోమవారం కూడా పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని జిల్లా అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement