మిత్రభేదం! | - | Sakshi
Sakshi News home page

మిత్రభేదం!

Oct 17 2026 3:09 AM | Updated on Oct 17 2026 3:09 AM

● చిత్తూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 60 డివిజన్లకు గానూ జనసేన 28 వార్డులు అడుగుతుంటే.. 7 స్థానాలు ఇస్తామని చెబతున్నారు. అయినా సరే సైనికులు పాపం నోరు మెదపడంలేదు. ఇక బీజేపీ అడిగిందే 10 డివిజన్లు, కానీ, మూడు మాత్రమే ఇస్తామని టీడీపీ నేతలు తేల్చి చెప్పేశారు. పర్యవసనంగా చిత్తూరులో 32 డివిజన్లలో కమలనాథులు పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పనిలో పనిగా మేయర్‌ అభ్యర్థిగా ఢిల్లీరాణి పేరిట నామినేషన్‌ దరఖాస్తు తీసుకెళ్లారు. ● పలమనేరులోని 36 వార్డుల్లో జనసేన 8 అడిగితే 2 చోట్ల మాత్రమే హామీ లభించింది. బీజేపీ 4 అడిగితే.. కేవలం ఒక్క వార్డు ఇస్తామన్నారు. ఇక్కడ కూటమి నుంచి ఛైర్‌పర్సన్‌ ఆశిస్తున్న రాజ్యలక్ష్మికి ఏమాత్రం సహకరించకూడదని సైనికులు తీర్మా నం చేసినట్లు తెలుస్తోంది. ఇది కేవలం రూపేష్‌ మాధవి ఆడుతున్న నాటకమేనని ప్రత్యర్థి వర్గం ఆరోపిస్తోంది. ● నగరిలో 40 వార్డులుంటే జనసేనకు 2, బీజేపీ 1 వార్డుపై హామీ లభించింది. మిగిలినవార్డులన్నింట్లో టీడీపీ అభ్యర్థులే పోటీ చేస్తున్నారు. చెంగుంద మొదలియార్లను కలుపుకుని టీడీపీకి తమ సత్తా చూపించాలని సైనికులు, కమలనాథులు గుర్రుగా ఉన్నారు. ● కుప్పం మున్సిపాలిటీలో జససేన, బీజేపీ పరిస్థితి దారుణంగా ఉంది. వీళ్లను పట్టించుకునే దిక్కు కూడా లేదిక్కడ. గట్టిగా అడిగితే ఓ కౌన్సిలర్‌ పడేద్దామన్న ధోరణిలో టీడీపీ స్థానిక నాయకత్వం ఆలోచిస్తోంది.

పేరుకు కూటమే తప్ప.. మమ్మల్ని ఇక్కడ ఎవరూ పట్టించుకోవడం లేదు అన్నా. చిత్తూరులో ఎంపీ, ఎమ్మెల్యేలు మా ఓట్లు లేకుండా గెలిచారా చెప్పండి..? ఇప్పుడు అన్యాయం జరుగుతున్నా మా అధినేత ఏమీ మాట్లాడడం లేదు. దీంతో మేమూ నోరు ఎత్తలేకున్నాం. ఏదో బిచ్చం వేసినట్లు, మూడు, నాలుగు సీట్లు ఇస్తాం అంటా ఉంటే గుండె రగిలి పోతా ఉండాది. – జనసైనికుడి కడుపు మంట

రాష్ట్రంలో రెండు కార్పొరేషన్లు ఇచ్చాం, ఇన్ని మున్సిపాలిటీలు ఇచ్చామని చెబుతున్నారు. మూడుసార్లు టీడీపీ నేతతో మాట్లాడితే రెండు చోట్ల అవకాశం ఇస్తామని చెబుతున్నారు. అందుకే చిత్తూరులోని మొత్తం 60 డివిజన్లలో మా అభ్యర్థులు బలంగా ఉండే 32 చోట్ల నామినేషన్లు వేయాలని నిర్ణయించుకున్నాం. – బీజేపీ నేత హెచ్చరిక

పురపోరులో ఏకపక్షంగా టీడీపీ వ్యవహారం

జనసేన, బీజేపీ నేతలకు రిక్తహస్తం

కౌన్సిలర్‌ సీట్లు కూడా ఇవ్వని ఎమ్మెల్యేలు

చిత్తూరులో 30 వార్డుల్లో పోటీకి సిద్ధమైన కమలనాథులు

నగరి, కుప్పంలో తిరగబడిన జనసైనికులు

సాక్షి, చిత్తూరు: జిల్లాలో చిత్తూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (చుడా), వన్నెకుల క్షత్రియ కో–ఆ పరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌, జిల్లా వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, జిల్లా కో–ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్‌, ఆర్టీసీ చైర్మన్‌, కాణిపాకం వినాయస్వామి ఆలయ కమిటీ చైర్మన్‌, కుప్పం రెస్కో, గంగమ్మ ఆలయ కమిటీ చైర్మన్‌, చిత్తూరు ప్రభుత్వాస్పత్రి అభివృద్ధి మండలి కమిటీ సభ్యులు, కుప్పం, పెనుమూరు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీల చైర్మన్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క నామినేటెడ్‌ పదవిని టీడీపీ నేతలే దక్కించుకున్నారు. బీజేపీ, జనసేన నేతల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా నామినేటెడ్‌ పదవుల భర్తీలో గుర్తుకురాలేదా..? అంటూ ఆపార్టీల శ్రేణులు రగిలిపోతున్నారు. పేరుకు కూటమిలో మిత్రపక్షాలని చెప్పుకుంటూ ద్రోహం చేస్తున్నారని మండిపడుతున్నారు.

అధికారంలోకి రావడానికి మూడు పార్టీలు కలిశాయి. ప్రభుత్వం వచ్చి 28 నెలలు గడిచాయి. జిల్లాలో భర్తీ చేసిన నామినేటెడ్‌ పదవులు 87. ప్రస్తుతం స్థానిక ఎన్నికలు. కానీ, జిల్లాలో మూడు మున్సిపల్‌ చైర్మన్లు, ఒక మేయర్‌ టీడీపీ తన వద్దే ఉంచుకుంది. దీంతో కూటమి గెలుపు కోసం కలిసి పనిచేసిన జనసేన,బీజేపీలకు రిక్తహస్తం తప్పలేదు. అలవాటు ప్రకారం మరోమారు ఈ రెండు పార్టీలకు టీడీపీ ద్రోహం చేసేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement