చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరు మేయర్ అభ్యర్థిగా వన్నెకుల క్షత్రియ (బీసీ) సామాజిక వర్గానికి చెందిన ఆర్.చంద్రశేఖర్ ఎంపికయ్యారు. శుక్రవారం రాత్రి ఈ మేరకు వైఎస్సార్సీపీ అధిష్టానం ప్రకటించింది. మాజీ డిప్యూటీ మేయర్, సీనియర్ న్యాయవాది, వన్నెకుల క్షత్రియ సంఘం న్యాయసలహాదారుడు చంద్రశేఖర్‌ను మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. పార్టీ ప్రారంభం నుంచి చంద్రశేఖర్ చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గతంలో నగర అధ్యక్షుడిగా, ప్రస్తుతం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. సీనియర్ న్యాయవాదిగా అయిన ఆయన నగరంలో అందరికి సుపరిచితులు.
ప్రశాంతంగా
నామినేషన్ల స్వీకరణ
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాలతో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద జనసమూహాల కదలికలపై డ్రోన్ల ద్వారా నిరంతరం నిఘా ఉంచుతున్నా రు. చిత్తూరు, నగరి సబ్ డివిజన్లలో నామి నేషన్ కేంద్రాలను అడిషనల్ ఎస్పీలు మహబూబ్ బాషా, ఎస్.షాను స్వయంగా పరిశీలించారు. కుప్పం, పలమనేరులలోనూ భద్రతను సమీక్షించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
టీడీపీ అభ్యర్థులు వీరే
సాక్షి, చిత్తూరు: చిత్తూరు, తిరుపతి జిల్లాలో పోటీచేయనున్న చైర్పర్సన్, మేయర్ అభ్యర్థుల జాబితాను టీడీపీ అధిష్టానం శుక్రవారం ప్రకటించింది. చిత్తూరు మేయర్ అభ్యర్థిగా కఠారి హేమలత, తిరుపతి మేయర్ అభ్యర్థిగా మన్నెం శ్రీనివాసప్రసాద్, నగరి అభ్యర్థిగా శ్రీనివాస్, కుప్పం అభ్యర్థిగా రాజ్‌కుమార్‌ను ప్రకటించింది.
‘కోడ్’ పర్యవేక్షణకు
ప్రత్యేక బృందాలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమి త్ కుమార్ గాంధీ ఉత్తర్వులు జారీచేశారు. ఎన్నికల నిబంధనల అమలు పర్యవేక్షణకు ప్రతి మండలానికి ఒక తహసీల్దార్‌తో పాటు ప్రత్యేక బృందాలను నియమించినట్లు వివరించారు. బైరెడ్డిపల్లి – ఎంఎస్ ప్రసన్న కుమార్, బంగారుపాళ్యం– షబ్బీర్ బాషా, చిత్తూరు– కల్యాణి, గంగాధరనెల్లూరు– శ్రీనివాసులు, గంగవరం– రేఖ, గుడిపాల– శ్రీనివాసులు, గుడుపల్లి– సీతారామ్, ఐరాల– రామకృష్ణ, కార్వేటినగరం–నాగరాజు, కుప్పం–రమేష్‌బాబు, నగరి–రవికుమార్, నిండ్ర– ఈశ్వర్‌బాబు, పలమనేరు– రమేష్‌రెడ్డి, పాలసముద్రం– గుర్రప్ప, పెద్దపంజాణి– రామమూర్తి, పెనుమూరు– లోకేశ్వరి, పులిచెర్ల– జయసింహా, పూతలపట్టు – ఉదయ్‌సంతోష్, రామకుప్పం–కౌశలే, రొంపిచెర్ల–కిరణ్‌కుమార్, ఎస్ఆర్పురం–లోకనాథపిళ్‌లై,శాంతిపురం– ప్రకాష్‌బాబు, తవణంపల్లి–మాధవరాజు, వి.కోట–సూర్యప్రకాష్నాయక్, వెదురుకుప్పం– బాబు, విజయపురం– మునిశైలజ, యాదమరి– పార్థసారధి ని ప్రత్యేక అధికారులుగా నియమించారు.


