పుంగనూరులో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిపై టీడీపీ గూండాలు శుక్రవారం చేసిన దాడి దారుణమని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థను పచ్చమూక అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను భయపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకుంటే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఏకంగా పార్లమెంట్ సభ్యుడిపై దాడి జరుగుతున్నప్పటికీ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ఎన్నికల కమిషన్ బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు.
– పలమనేరు/ వి.కోట/ చిత్తూరు కార్పొరేషన్
ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి
ఓటమి భయంతోనే టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు. సాక్షాత్తు ఎంపీపై దాడి చేసి వాహనాలను ధ్వంసం చేస్తుంటే పోలీసులు పట్టించుకోకపోవడం క్షమార్హం కాదు. పచ్చమూక అకృత్యాలను ప్రజలు గమనిస్తున్నారు. తగిన సమయంలో బుద్ధి చెబుతారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎన్నికల కమిషనర్ తగు చర్యలు చేపట్టాలి. కేంద్ర బలగాలను రప్పించి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి.
– వెంకటేగౌడ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు
టీడీపీ తీరు అమానుషం
పుంగనూరులో టీడీపీ శ్రేణులు రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలపై దాడి చేయడం అమానుషం. దీన్ని చీకటి దినంగా భావిస్తున్నాం. ప్రశాంతంగా నామినేషన్ వేయనీయచుండా వెన్నుపోటు పార్టీ నేతలు అడుగడుగునా అడ్డుపడుతున్నారు. ఇలాంటి దాడులకు పెద్దిరెడ్డి కుటుంబం భయపడదు. ప్రజలను మెప్పించి ఎన్నికల్లో గెలవాలి కానీ, ఈ విధంగా అరాచకాలు చేస్తే మూల్యం చెల్లించక తప్పదు
– విజయానందరెడ్డి, వైఎస్సార్సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త
ఓటమిని అంగీకరించినట్టే..
ఎన్నికల్లో పరోక్షంగా ఓటమిని చంద్రబాబు అంగీకరించినట్టే ఇది. ఎన్నికల్లో పోటీచేసే హక్కు అందరికి ఉంటుంది. దాడులతో ఎవరినీ బెదిరించలేరు. పుంగనూరు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ వేసే అభ్యర్థులకు మద్దతుగా వెళుతున్న రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి అన్నపై దాడి చేయడం హేయమైన చర్య. పోలీసులు సమక్షంలో జరిగిన దాడిని చూస్తుంటే అధికార దుర్వినియోగం తెలుస్తోంది.
– ద్రాక్షాయణి, వైఎస్సార్సీపీ మహిళ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
పిరికి పందల చర్య
రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, రాయచోటి వైఎస్సార్సీపీ కార్యాలయంపై దాడి పిరికి పందల చర్య. రెండున్నరేళ్ల చంద్రబాబు పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. దీంతోనే స్థానిక సంస్థల ఎన్నికలలో అరాచకాలకు పాల్పడుతున్నారు. . గతంలో రిజర్వేషన్ల రూపంలో కోర్టుకు వెళ్లి ఎన్నికలను వాయిదా వేయించేందుకు యత్నించారు. టీడీపీ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే నిర్భయంగా గొడవలు లేకుండా ఎన్నికలు నిర్వహించాలి.
– రాజారెడ్డి, వైఎస్సార్టీయూసీ జోనల్ ఇన్చార్జి
ఓటమి భయంతోనే..
ఎన్నికల్లో ఓడిపొతామనే భయంతోనే టీడీపీ నేతలు దాడులకు దిగుతున్నారు. ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడి చేయడం అమానుషం. ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగిస్తున్నారు. ఎన్నికల్లో సైతం రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. చివరకు ఎంపీపై హత్యాయత్నానికి సైతం తెగబడుతున్నారు. చేసిన పాపం ఊరికే పోదు. భవిష్యత్‌లో ఇంతకు ఇంతా అనుభవించక తప్పదు. ఇప్పటికై నా ఎన్నికల కమిషన్ బాధ్యత తీసుకోవాలి.
– శ్రీనివాసులు, జెడ్పీ మాజీ చైర్మన్
ఎంపీకే రక్షణ లేకుంటే ఎలా..?
పార్లమెంట్ సభ్యుడికే రక్షణ లేకుంటే ఎలా..? చంద్రబాబు ప్రభుత్వంలో రాజకీయాలు మరింత దారుణంగా తయారయ్యాయి. అభ్యర్థులను నామినేషన్ కూడా వేయనీయడం లేదు. పార్టీ అభ్యర్థులకు అండగా నిలిచినందుకు ఎంపీ మిథున్రెడ్డిపైనే దాడికి పాల్పడ్డారు. పోలీసులను అడ్డుపెట్టుకుని గూండాయిజం చేస్తున్నారు. ఇప్పటికై నా ఎన్నకలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి.
– పీఎన్ నాగరాజు, వైఎస్సార


