ఒక్క రోజే మిగిలింది! | - | Sakshi
Sakshi News home page

ఒక్క రోజే మిగిలింది!

Oct 17 2026 3:09 AM | Updated on Oct 17 2026 3:09 AM

● పురపోరులో అభ్యర్థుల ఎంపికపై వీడని ఉత్కంఠ ● మేయర్‌, చైర్‌పర్సన్‌ ఎంపికపై ప్రధాన పార్టీల గుంబనం ● రేపటితో ముగియనున్న నామినేషన్ల పర్వం ● తొలి రోజు 40 నామినేషన్ల దాఖలు

పురపోరులో బరిలో దిగాలనుకుంటున్న అభ్యర్థులు ప్రస్తుతం అగ్నిపరీక్షను ఎదుర్కొంటున్నారు. నామినేషన్లు వేయడానికి మరో 24 గంటలు మాత్రమే గడువు ఉండడంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఆశావహులు టెన్షన్‌ పడుతున్నారు. మేయర్‌ నుంచి వార్డు కౌన్సిలర్‌ వరకు సస్పెన్స్‌ కొనసాగుతుండడంతో ఉద్విగ్నంగా పడిగాపులు కాస్తున్నారు.

సాక్షి, చిత్తూరు: నామినేషన్ల దాఖలుకు తొలిరోజైన శుక్రవారం జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీ ల్లో 40 దరఖాస్తులు అందాయి. చిత్తూరు కార్పొరేషన్‌లో మేయర్‌ స్థానానికి ఇంకా ఎవరూ నామినేషన్‌ దాఖలు చేయలేదు. అయితే జనసేన, బీజే పీ, టీడీపీ నుంచి ఆశావహులు నామినేషన్‌ పత్రా లు తీసుకెళ్లారు. 60 వార్డులకు గానూ 15 వార్డు ల్లో పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. కుప్పంలో 11 మంది నామినేషన్లు వేయగా, చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా కూటమి నుంచి వెంకటేష్‌, రాజ్‌కుమార్‌ ఇద్దరూ దరఖాస్తు చేసుకున్నారు. పలమనేరులో 3 నామినేషన్లు పడగా, చైర్‌పర్సన్‌ కోసం ఏ ఒక్కరూ నామినేషన్‌ వేయలేదు. నగరి లో 8 నామినేషన్లు దాఖలయ్యాయి. చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా కూటమి నుంచి శ్రీనివాస్‌ నామినేషన్‌ వేశారు.

అదే ఉత్కంఠ

నామినేషన్ల దాఖలుకు ఆదివారంతో గడువు ముగియనుంది. ఇప్పటి వరకు అధికార, ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థుల వివరాలు ప్రకటించకుండా గుంబనంగా ఉన్నాయి. ఆశావహులతో నామినేషన్లు వేయించాక, పరిశీలనలో మిగిలే అభ్యర్థులను చూసుకుని.. ఆపై బీఫారమ్‌ అందజేయనున్నట్లు తెలిసింది. ఆ మేరకు అధికారికంగా ఎవరు తమ అభ్యర్థి అనేదానిపై స్పష్టత ఇచ్చేందుకే పార్టీలు మొగ్గు చూపుతున్నాయి. 21వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు ఉండడంతో ముందే అభ్యర్థిని అధికారికంగా ప్రకటిస్తే ఇబ్బందులు రావొచ్చ ని అంచనా వేస్తున్నారు.

మున్సిపోల్స్‌ నామినేషన్లు ఇలా

మున్సిపాలిటీ వార్డులు వైఎస్సార్‌సీపీ కూటమి మేయర్‌/చైర్‌పర్సన్‌

చిత్తూరు 60 9 6 0

నగరి 40 0 8 1 (కూటమి)

పలమనేరు 36 1 2 0

కుప్పం 32 0 11 2(కూటమి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement