పుత్తూరు: ప్రభుత్వం ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా ఇస్తున్న స్వ చ్ఛాంధ్ర అవార్డుల్లో ఈ ఏడాది పుత్తూరును రెండు అవార్డులు వరించాయి. శుక్రవారం గాంధీ జయంతిని పురస్కరించుకుని తిరుపతిలో కలెక్టర్ వెంకటేశ్వర్ నుంచి స్వచ్ఛ మున్సిపాలిటీ అవార్డును కమిషనర్ నాగేశ్వరరావు అందుకున్నారు. అలాగే స్థానిక బెస్త వీధిలోని అర్భన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు వచ్చిన స్వచ్ఛ హాస్పిటల్ అవార్డును డాక్టర్ ఆశా అందుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ సమష్టి కృషితోనే అవార్డును అందుకున్నామని తెలిపారు. పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు.
కలెక్టర్ వెంకటేశ్వర్ నుంచి అవార్డు స్వీకరిస్తున్న
కమిషనర్ నాగేశ్వరరావు
అవార్డు స్వీకరిస్తున్న డాక్టర్ ఆశా


