స్వచ్ఛాంధ్రలో పలమనేరుకు అవార్డులు | - | Sakshi
Sakshi News home page

స్వచ్ఛాంధ్రలో పలమనేరుకు అవార్డులు

Oct 3 2026 2:08 AM | Updated on Oct 3 2026 2:08 AM

– రాష్ట్ర స్థాయిలో రెండు, జిల్లాలో రెండు

పలమనేరు: స్వచ్ఛాంధ్ర పురష్కారాల్లో భాగంగా పలమనేరుకు నాలుగు అవార్డులు దక్కాయి. రాష్ట్ర స్థాయిలో మున్సిపాలిటీలకు సంబంధించి పలమనేరు స్వచ్ఛాంధ్ర అవార్డును కై వసం చేసుకుంది. విజయవాడలో జరిగిన అవార్డుల ప్రదానం కార్యక్రమంలో స్థానిక మున్సిపల్‌ కమిషనర్‌ లోకేష్‌ వర్మ తన సిబ్బందితో కలిసి సీఎం చంద్రబాబు నుంచి శుక్రవారం అవార్డును స్వీకరించారు. వందశాతం ఇంటింటి చెత్తసేకరణ, చెత్త ప్రాసెసింగ్‌, వ్యర్థాల నిర్వహణ, పరిశుభ్రత, పర్యావరణం, ప్లాస్టిక్‌పై నియంత్రణ తదితరాల్లో మంచి ప్రతిభకు ఈ అవార్డు దక్కిందని కమిషనర్‌ తెలిపారు. అదే విధంగా మండలంలోని కొలమాసనపల్లి ఎస్సీ హాస్టల్‌ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డును హాస్టల్‌ వార్డెన్‌ శీనప్ప సీఎం నుంచి పొందారు. అక్కడి హాస్టల్‌లో గత కొన్నేళ్ళుగా చేపట్టిన కార్యక్రమాలు చక్కగా ఉన్నాయనే విషయంలో ఈ అవార్డు దక్కింది. మరోవైపు జిల్లా స్థాయి ఇదే అవార్డు బెస్ట్‌ ఏఎంసీగా పలమనేరు ఎంపికై ంది. ఈ అవార్డును మార్కెట్‌ కమిటీ కార్యదర్శి సంజీవకుమార్‌ జిల్లా అధికారుల చేతుల మీదుగా స్వీకరించారు. మరోవైపు ప్రజా సమస్యల పరిష్కారంతో కృషిచేస్తున్న పలమనేరు పరిరక్షణ సమితికి ఈదఫా మళ్ళీ జిల్లా స్థాయిలో స్వచ్ఛాంధ్ర అవార్డు దక్కింది. గత తొమ్మిదేళ్లుగా పట్టణ సమస్యలపై పీపీఎస్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారాలకోసం కృషిచేస్తోంది. మొత్తం మీద పలమనేరుకు రాష్ట్ర స్థాయిలో రెండు, జిల్లా స్థాయిలో రెండు అవార్డులను కై వసం చేసుకుంది.

సీఎం చంద్రబాబు నుంచి స్వీకరిస్తున్న

మున్సిపల్‌ కమిషనర్‌ కేఎల్‌ వర్మ

జిల్లా స్థాయిలో ఉత్తమ సేవా అవార్డును దక్కించుకున్న పీపీఎస్‌ సభ్యులు

అప్పలాయగుంట ఆలయానికి స్వచ్ఛ అవార్డు

వడమాలపేట (పుత్తూరు): స్వచ్ఛాంధ్ర అవార్డులు–2026 పేరిట నిర్వహించిన పోటీల్లో అప్పలాయగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం అవార్డును దక్కించుకుంది. శుక్రవారం గాంధీ జయంతిని పురస్కరించుకుని తిరుపతిలో కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ నుంచి ఆలయ సూపరిండెంట్‌ శ్రీవాణి, ఆలయ అధికారి వేణుగోపాల్‌ స్వచ్ఛాంధ్ర అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవాణి మా ట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో సిబ్బంది చేసిన కృషి ఫలితంగానే అవార్డు వరించిందన్నారు. వేణుగోపాల్‌ మాట్లాడుతూ భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడానికి నిరంతరం కృషి కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement