అండర్‌–19 సాఫ్ట్‌బాల్‌ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

అండర్‌–19 సాఫ్ట్‌బాల్‌ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక

Oct 3 2026 2:08 AM | Updated on Oct 3 2026 2:08 AM

– చిత్తూరు జిల్లా నుంచి

250 మంది క్రీడాకారుల హాజరు

నగరి: స్థానిక కేవీకే క్రీడా మైదానంలో స్కూల్‌ గేమ్‌ ఫెడరేషన్‌ క్రీడల్లో భాగంగా శుక్రవారం అండర్‌–19 సాఫ్ట్‌బాల్‌ బాలబాలికల జిల్లా స్థాయి ఎంపిక పోటీ లు ఉత్సాహంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 250 మంది క్రీడాకారులు ఈ ఎంపిక పోటీలకు హాజరై తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 10వ తేదీ నుంచి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరగనున్న రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో పాల్గొననున్నట్లు చిత్తూరు జిల్లా స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శి ఎస్‌ఎం లోకనాథం తెలిపారు. క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా కు మంచి పేరు తీసుకురావాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. ఎంపిక పోటీల్లో తిరుపతి జిల్లా స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శి సాంబశివరావు, వ్యాయా మ ఉపాధ్యాయులు జయప్రకాష్‌, దశరథ, కృష్ణ, మురళి, ప్రకాష్‌, అన్బు అరసు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement