జాతీయ రహదారిపై బోల్తాపడ్డ లారీ | - | Sakshi
Sakshi News home page

జాతీయ రహదారిపై బోల్తాపడ్డ లారీ

Oct 3 2026 2:08 AM | Updated on Oct 3 2026 2:08 AM

కుప్పంరూరల్‌: జాతీయ రహదారిపై లారీ బోల్తాపడి పెనుప్రమాదం తప్పిన సంఘటన కుప్పం మండలం, నడుమూరు సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. తమిళనాడు రాష్ట్రం ఈరోడ్డు ప్రాంతం నుంచి దుస్తులు వేసు కుని కుప్పం వైపు వస్తున్న లారీ నడుమూరు సమీపానికి రాగానే అదుపు తప్పి బోల్తాపడింది. ఆ సమయంలో ముందు, వెనుక వాహనా లు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్‌, క్లీనర్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న ఏఎస్పీ హేమంత్‌, అర్బన్‌ సీఐ జీటీ నాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని జాతీయ రహదారిపై రాక పోకలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశా రు. సంఘటనపై విచారణ చేపడుతున్నారు.

విద్యుత్‌షాక్‌తో

లైన్‌మన్‌కు తీవ్రగాయాలు

గుడిపాల: విద్యుత్‌షాక్‌తో శుక్రవారం ఓ జూనియర్‌ లైన్‌మన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. చిత్తూరు రూరల్‌ మండలం తుమ్మిందపాళ్యం గ్రామానికి చెందిన శివకుమార్‌ గుడిపాలలో జూనియర్‌ లైన్‌మన్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం గుడిపాలలో ట్రాన్స్‌పార్మర్‌లో ఫీజు పో వడంతో ఫీజు వేసేందుకు సబ్‌స్టేషన్‌కు ఫోన్‌చేసి ఎల్‌సీ అడిగాడు. ఎల్‌సీ అడిగిన వెంటనే కరెంట్‌ ఆఫ్‌ కాకమునుపే ట్రాన్స్‌ఫార్మర్‌ వద్దకు వెళ్లాడు. ఫీజు వేసేందుకు వైరును పట్టుకోవడంతో విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. దీంతో వెంటనే స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వడంతో టెక్నీషియన్‌ శివ వెంటనే చీలాపల్లె సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యంకోసం వేలూరు సీఎంసీకి తరలించారు.

కలెక్టర్‌ సమీక్ష వాయిదా

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల ల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలతో ఈ నెల 3 వ తేదీన నిర్వహించాల్సిన కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ సమీక్ష వాయిదా వేశారు. ఈమేరకు శుక్రవారం డీఈవో లక్ష్మీనారాయణ వెల్లడించా రు. ఆయన మాట్లాడుతూ కలెక్టర్‌ సమీక్ష ఈనెల 6 తేదీన జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో నిర్వహిస్తారని తెలిపారు. ఆరోజు జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు తప్పనిసరిగా హాజరుకావాలని డీఈవో సూచించారు.

గాంధీ ఆశయాలు శిరోధార్యం

చిత్తూరు కలెక్టరేట్‌ : మహాత్మాగాంధీ ఆశయాలు ప్రతి ఒక్కరికీ శిరోధార్యం అని ట్రైనీ కలెక్టర్‌ వెంకటేష్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో గాంధీ జయంతి, భారత మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి నిర్వహించారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

4న జిల్లా జూనియర్‌, సబ్‌ జూనియర్‌ కబడ్డీ జట్ల ఎంపిక

చిత్తూరు కలెక్టరేట్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర 52వ జూనియర్‌ బాలుర, 36వ సబ్‌ జూనియర్‌ బాలుర అంతర్‌ జిల్లా ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొనేందుకు ఈనెల 4 న జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు మమతారెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఎంపిక పోటీలు ఆదివారం ఉదయం 10 గంటలకు సదుం పోలీస్‌ క్రీడా మైదానంలో జరుగుతాయని, జిల్లాలోని ఆసక్తి గల క్రీడాకారులు పాల్గొనాలని కోరారు. జూనియర్‌ బాలురు కేటగిరీలో క్రీడాకారులు 75 కేజీల లోపు బరువు కలిగి ఉండాలన్నారు. 2006 నవంబర్‌ 4వ తేదీ తర్వాత జన్మించిన వారు మాత్రమే అర్హులన్నారు. సబ్‌ జూనియర్‌ బాలురు కేటగిరీలో క్రీడాకారులు 60 కేజీల లోపు బరువు కలిగి ఉండాలని, 2010 డిసెంబర్‌ 12వ తేదీ తర్వాత జన్మించిన వారు అర్హులన్నారు. సబ్‌ జూనియర్‌ బాలుర రాష్ట్రస్థాయి పోటీలు ఏలూరు జిల్లా నూజివీడులో ఈనెల 10 నుంచి 12 వరకు జరుగుతాయన్నారు. జూనియర్‌ బాలుర రాష్ట్రస్థాయి పోటీలు ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఈనెల 16 నుండి 18 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపిక పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు తమ వెంట ఆధార్‌ కార్డు జిరాక్స్‌, ఒరిజినల్‌ జనన ధ్రువీకరణ పత్రం, 6 పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫోటోలను తప్పనిసరిగా తీసుకురావాలని ఆర్గనైజింగ్‌ సెక్రటరీ రవీంద్రరెడ్డి సూచించారు. జాతీయ క్రీడాకారులు శ్రీనివాసులు సమక్షంలో ఈ ఎంపిక పోటీలు నిష్పక్షపాతంగా జరుగుతాయని తెలిపారు. ఇతర వివరాలకు 9490005167, 9440345455 ఫోన్‌ నంబర్లను సంప్రదించవచ్చని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement