కామధేనువుపై గణనాథుడు | - | Sakshi
Sakshi News home page

కామధేనువుపై గణనాథుడు

Oct 3 2026 1:20 AM | Updated on Oct 3 2026 1:20 AM

కామధేను వాహనంపై విహరిస్తున్న వరసిద్ధి వినాయకుడు

కాణిపాకం: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక ఉత్సవం కనులపండువగా కొనసాగింది. ఈ ఉత్సవంలో భాగంగా స్వామివారు కామధేనువుపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఉదయం ఆలయంలో అభిషేక పూజలు చేశారు. ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భారీగా తరలివచ్చిన భక్తజనం స్వామిని దర్శించి తరించారు. రాత్రి స్వామి వారు కామధేనువు వాహనంపై కనువిందు చేశారు. తొలుత అలంకార మండపంలో శ్రీసిద్ధి బుద్ధి సమేత వినాయస్వామి ఉత్సమూర్తులను పట్టుపీతాంబరాలు, పరిమళభరిత పుష్పమాలికలు, విశేష ఆభరణాలతో అలంకరించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకెళ్లి కామధేనువాహనంపై అధిష్టింపజేశారు. మంగళ వాయిద్యాలు, మేళాతాళాలు, కోలాటాలు, భజన బృందాల ప్రదర్శనల నడుమ ఊరేగింపు అంగరంగ వైభవంగా చేపట్టారు. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించారు.

నేడు పుష్పపల్లకీ..

ప్రత్యేక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో శనివారం రాత్రి పుష్పపల్లకి సేవను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో పెంచల కిషోర్‌ తెలిపారు. ఇందులో భాగంగా ఆలయంలో ముందస్తు ఏర్పాట్లు చేశారన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement