కాణిపాకంలో పోటెత్తిన భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

కాణిపాకంలో పోటెత్తిన భక్తుల రద్దీ

Oct 3 2026 1:20 AM | Updated on Oct 3 2026 1:20 AM

– 8లో

శుక్రవారం సెలవు దినం కావడంతో కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.

గణనాథుని సేవలో

హైకోర్టు న్యాయమూర్తి

కాణిపాకం: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.సుజాత శుక్రవారం కాణిపాకంలో స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆమెకు దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. న్యాయమూర్తి జస్టిస్‌ సుజాత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ ఏఈఓ రవీంద్రబాబు ఆమెకు స్వామివారి తీర్థప్రసాదాలను, శేషవస్త్రాలను అందజేశారు.

ఖైదీల సంక్షేమ దినోత్సవం

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని చిత్తూరు నగరంలోని జిల్లా కారాగారంలో ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్య క్రమానికి జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.ఎస్‌. భారతి, జైలు సూపరింటెండెంట్‌ వెంకటరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించారు. పొరపాట్లు, ఆర్థిక ఇబ్బందుల వల్ల తప్పు చేసి జైలుకు వచ్చినప్పటికీ.. పున రావాసం పొంది సమాజంలో మంచి పౌరులుగా జీవించాలని కలెక్టర్‌ ఆకాంక్షించారు. గాంధీజీ బోధించిన సత్యం, అహింస సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. జైలులో తాగునీరు, విద్యుత్‌, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాల కొరత లేకుండా చూస్తామని, బెయిల్‌ లేదా ఇతర సమస్యలు ఉంటే తన కార్యాలయాన్ని సంప్రదించవచ్చని తెలిపారు. పుట్టుకతో ఎవరూ నేరస్థులు కారని, పరిస్థితుల వల్లే తప్పులు జరుగుతుంటాయని జడ్జి ఎం.ఎస్‌. భారతి పేర్కొన్నారు. ఏ సమస్య వచ్చినా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా కోర్టును ఆశ్రయించాలని సూచించారు. జైలులో ప్రభుత్వం అందిస్తున్న టైలరింగ్‌, ఎలక్ట్రీషియన్‌ కోర్సుల్లో నైపుణ్యాలు పెంపొందించుకుని ఉపాధి మార్గాలు వెతుక్కోవాలన్నారు. జిల్లా కారాగారంలో ఖైదీలకు కావాల్సిన అన్ని రకాల వసతు లు కల్పిస్తున్నామని జైలు సూపరింటెండెంట్‌ తెలిపారు. అనంతరం క్రీడలు, వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఖైదీలకు బహుమతులు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement