ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొందాం | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొందాం

Oct 3 2026 1:20 AM | Updated on Oct 3 2026 1:20 AM

● వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు మాజీ మంత్రి ఆర్కే రోజా దిశానిర్దేశం ● నిండ్రలో టీడీపీ మాజీ ఎంపీపీ, రిటైర్డ్‌ వీఆర్‌వో వైఎస్సార్‌సీపీలో చేరిక

నగరి: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి రోజా పిలుపునిచ్చారు. శుక్రవారం నగరిలోని పార్టీ కార్యాలయంలో నిండ్ర, విజయపురం మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో ఆమె విడివిడిగా సమావేశ మై స్థానిక రాజకీయ పరిస్థితులు, ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గత ఎన్నికల్లో అధికార పక్షం బూటకపు హామీలతో పాటు ఈవీఎం మేనేజ్‌మెంట్‌ ద్వారా విజయం సాధించిందని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వ పాలనపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని ఆమె పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ శ్రేణులంతా ఏకాభిప్రాయంతో, ఐకమత్యంతో పనిచేసి వైఎస్సార్‌సీపీని బలోపేతం చేయాలని సూచించారు.

నిండ్రలో టీడీపీకి షాక్‌

నిండ్ర మండలం ఆత్తూరు పంచాయతీకి చెందిన టీడీపీ మాజీ ఎంపీపీ రాజగోపాల్‌ నాయుడు, రిటైర్డ్‌ వీఆర్‌వో మేఘనాథం శుక్రవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. నగరిలోని మాజీ మంత్రి ఆర్కే రోజా కార్యాలయంలో ఆమె సమక్షంలో వారు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె వారికి వైఎస్సార్‌సీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన రాజగోపాల్‌ నాయుడు, మేఘనాథం మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో, మాజీ మంత్రి ఆర్కే రోజా నాయకత్వంలో పార్టీ బలోపేతానికి తమవంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిండ్ర మండలానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు వేణురాజు, ఉపాధ్యక్షులు మునికృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ దీప, రాష్ట్ర ఎస్సీసెల్‌ ప్రధాన కార్యదర్శి శ్యామ్‌లాల్‌, జిల్లాపార్టీ కార్యదర్శి అనిల్‌, మాజీ సర్పంచ్‌ బాబురెడ్డి, రాష్ట్ర మహిళా కార్యదర్శి మేరి, మాజీ వైస్‌ఎంపీపీ శుభారాము, నాయకులు రామచంద్రయాదవ్‌, శివలింగాచ్చారి, రమేష్‌, దామురెడ్డి, శేఖర్‌, విజయపురం మండలానికి చెందిన నాయకులు మండల అధ్యక్షుడు శివరాజు, మాజీ ఎంపీపీ బాలాజి, రాష్ట్ర ప్రచార విభాగం కార్యదర్శి శేఖర్‌రాజు, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి గుణశేఖర్‌రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్‌ విభాగం కార్యదర్శి గోవర్దన్‌నాయుడు, బూత్‌ కమిటీ అధ్యక్షుడు ప్రసన్న, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement