పల్లె జీవనాడిపై మట్టి వేటు! | - | Sakshi
Sakshi News home page

పల్లె జీవనాడిపై మట్టి వేటు!

Oct 1 2026 4:52 AM | Updated on Oct 1 2026 4:52 AM

గుంతలతో అధ్వానంగా మారిన

చెరువులు

పట్టించుకోని ఇరిగేషన్‌ అధికారులు

లోడుకింత వసూలు చేసుకుంటున్న

పచ్చనేతలు

కూర్నిపల్లి చెరువులో చేపట్టిన తవ్వకాలు

అగ్రహారం చెరువు దుస్థితి

పలమనేరు: పలమనేరు నియోజకవర్గంలోని చెరువుల్లోని మట్టిని కొందరు జేసీబీలతో యథేచ్ఛగా తవ్వుకుంటున్నారు. ఇప్పటికే సగానికి పైగా చెరువుల్లో పెద్ద పెద్ద గుంతలు తవ్వడంతో అధ్వానంగా మారిపోయాయి. ఆ మట్టిని రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, బిల్డింగ్‌లు, భూముల లెవలింగ్‌కు తరలిస్తున్నారు. నిర్ణయించిన మేర ఆ ప్రాంతంలోని పచ్చనేతలకు నగదు ముట్టజెప్పుతుండడంతో అధికారులు కూడా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు.

పది చెరువుల్లో యథేచ్ఛగా తవ్వకాలు

పలమనేరు నియోజకవర్గంలో మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంకులు వందకు పైగా ఉండగా చిన్నపాటి చెరువులు, కుంటలు 500 వరకు ఉన్నాయి. ఇందులో దాదాపు అన్ని చోట్లా మట్టి మాఫియా తవ్వకాలు చేస్తూనే ఉంది. పలమనేరు మండలంలోని బేలుపల్లి, టీఎస్‌ అగ్రహారం, కూర్మాయి, జల్లిపేట, కొత్తకుంట, బైరెడ్డిపల్లి మండలంలోని బైరెడ్డిపల్లి, గంగవరం మండలంలోని పది చెరువుల్లో తవ్వకాలు చేస్తున్నారు.

ఏం జరిగినా నో యాక్షన్‌

సాధారణంగా చెరువుల్లో మట్టిని తవ్వాలంటే సంబందిత పంచాయతీ అధికారుల ద్వారా అనుమతులు పొందాలి. అధికారులు సూచించిన మేరకు మట్టిని తవ్వుకోవాలి. ఇక మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంకులకు సంబందించి మొత్తం అజమాయిషీ ఇరిగేషన్‌ అధికారుదే. పలమనేరు నియోజకవర్గంలో ఎక్కడా రెవెన్యూ, పంచాయతీ, ఇరిగేషన్‌ శాఖల నుంచి అనుమతులు లేకుండానే మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. అధికారుల కళ్లముందే చెరువుల్లో జేసీబీలతో ఇష్టానుసారంగా తోడేస్తున్నా ఎవరూ అడ్డు చెప్పడంలేదు. అధికారపార్టీ నేతలు లోడు మట్టికి, ట్రాక్టర్‌కు ఇంత అని నిర్ణయించి డబ్బులు వసూలు చేసుకుంటున్నారనే మాట వినిపిస్తోంది. దీనిపై స్థానిక ఇరిగేషన్‌ డీఈ నాయక్‌ స్పందిస్తారునుకుంటే ఆయన ఇప్పటికే అధికారపార్టీ నేతలకు ఏజెంట్‌లా మారాడనే ఆరోపనులున్నాయి. జిల్లా స్థాయి అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చని పచ్చనేతలు నిరూపిస్తున్నారు. ప్రకృతి వనరులను తమ సొంత వనరుల్లా దోచుకుని దండుకుంటున్నారు. చెరువుల్లో మట్టి తవ్వకాలకు సొంతంగా అనుమతులు ఇస్తూ లోడుకు ఇంత అని వసూలు చేసుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. ఈ విషయం తెలిసినా ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చెరువుల్లో యథేచ్ఛగా తవ్వకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement