కల్పవృక్షంపై గణాధిపుడు | - | Sakshi
Sakshi News home page

కల్పవృక్షంపై గణాధిపుడు

Oct 1 2026 4:52 AM | Updated on Oct 1 2026 4:52 AM

● కాణిపాకంలో అత్యంత వైభవంగా ప్రత్యేక బ్రహ్మోత్సవాలు ● కనుల పండువగా సిద్ధి, బుద్ధి సమేత వినాయకుడి ఊరేగింపు ● తరలివచ్చిన అశేష భక్తజనం.. ● కిటకిటలాడిన మాడవీధులు

కాణిపాకం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో ప్రత్యేక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం స్వామివారు కల్పవృక్ష వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. వేకువజామున సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపి నిత్య కై ంకర్యాలు చేశారు. విశేష అభిషేకాలు, దివ్య అర్చనలు చేశారు. సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. రాత్రి అలంకార మండపంలో సిద్ధి, బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకాలు చేశారు. అనంతరం పట్టుపీతాంబరాలు, పరిమళభరిత సుగంధ పుష్ప మాలికలు, అమూల్యమైన ఆభరణాలతో స్వామివారిని దివ్యంగా అలంకరించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ స్వామివారిని కల్పవృక్ష వాహనంపై కొలువుదీర్చారు.

అంగరంగ వైభవంగా ఊరేగింపు

ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం మంగళ వాయిద్యాలు, తబలా భజనలు, కోలాటాలు, కళాకారుల వివిధ సాంస్కృతిక ప్రదర్శనల నడుమ కల్పవృక్ష వాహన సేవ ప్రారంభమైంది. స్వామివారు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు పట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement