వి.కోట: స్కూల్ కమిటీ చైర్మన్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, ఎన్నికై న చైర్మన్‌ను కొనసాగించకూడదని యాలకల్లు పంచాయతీ ఎర్రినాగేపల్లికి చెందిన గ్రామస్తులు డిమాండ్ చేశారు. వారు బుధవారం ఎర్రినాగేపల్లి ప్రాథమికోన్నత పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వారు మాట్లాడుతూ పాఠశాలలో మంగళవారం నిర్వహించిన స్కూల్ కమిటీ చైర్మన్ ఎన్నికల్లో అవకవతకవలు జరిగాయన్నారు. కమిటీ చైర్మన్‌గా గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని ఎన్నుకున్నారని, దీనిపై తాము అభ్యంతరాలు తెలిపినా పట్టించుకోలేదన్నారు. ఈ ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేిశారు. లేనిపక్షంలో తమ పిల్లలకు టీసీలు ఇచ్చేయాలన్నారు. ఈ విషయంగా పాఠాశాల వద్ద కొంత సేపు ఉద్రిక్త వాతవరణం నెలకొంది. సమస్యకు అధికారులు తగిన పరిష్కారం చూపాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.


