చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరు రైల్వేస్టేషన్‌లోని రిజర్వేషన్ కౌంటర్‌లో సర్వర్ మొరాయించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి రిజర్వేషన్ కౌంటర్ సిస్టం సమస్య వల్ల టికెట్లు జారీని నిలిపివేసినట్లు తెలిసింది. సాయంత్రం నుంచి రాత్రి వరకు పదుల సంఖ్యలో ప్రయాణికులు రిజర్వేషన్ కౌంటర్ వద్దకు వచ్చి సర్వర్ సమస్య అని తెలియడంతో వెనుతిరుగుతున్నారు. గాంధీ జయంతి, తదుపరి సెలవు రోజులు, దసరా సందర్భంగా పలువురు రిజర్వేషన్ చేసుకోవడానికి స్టేషన్‌కు వచ్చారు. సర్వర్ సమస్యతో టికెట్లు జారీ చేయలేమని సిబ్బంది చెప్పడంతో అసహనంతో వెనుతిరుగుతున్నారు. రిజర్వేషన్ కౌంటర్ వద్ద సిస్టం ఫెయిల్యూర్ అనే బోర్డును ఏర్పాటు చేశారు.


