రెచ్చగొట్టినా స్పందించొద్దు | - | Sakshi
Sakshi News home page

రెచ్చగొట్టినా స్పందించొద్దు

Oct 1 2026 4:52 AM | Updated on Oct 1 2026 4:52 AM

● వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలే లక్ష్యంగా కొంతమంది పోస్టులు ● ఎస్పీ స్పందించి చర్యలు తీసుకోవాలి ● వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి

చిత్తూరు కార్పొరేషన్‌: వైఎస్సార్‌సీపీ నాయకులు, మహిళల మీద కూటమి నాయకులు, కార్యకర్తలు అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని ఆ పార్టీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి తెలిపారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. కొద్ది రోజులుగా కొంతమంది టీడీపీ నాయకులు పనిగట్టుకుని సోషల్‌ మీడియాలో ఏఐ ద్వారా పోస్టులను సృష్టించి ఫేక్‌ అకౌంట్స్‌ ద్వారా పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. దీనిపై ఎస్పీ స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. తాము శాంతిభద్రతలకు సహకరిస్తామని స్పష్టం చేశారు. కూటమి నాయకులు రెచ్చగొట్టే ధోరణిలో ప్రణాళికాబద్దంగా పోస్టులు పెడుతున్నారని తెలిపారు. ఎంతకాలమూ ఓపికగా ఉండలేమని పేర్కొన్నారు. అసభ్య పోస్టులను వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగామ్‌, ఎక్స్‌లో పోస్టు చేస్తూ వైరల్‌ చేస్తున్నారని పేర్కొన్నారు. వీటిపై చర్చ జరగాలని, ఏదో ఒక వంకతో తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని తెలిపారు. ఇటువంటి సంప్రదాయం గతంలో ఎప్పుడూ లేదన్నారు. వారు ఎలాంటి పోస్టులు పెట్టినా పట్టించుకోవద్దని, వాటిని వారి విజ్ఞతకే వదిలేయాలని వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు, నాయకులకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement