నేటి నుంచి క్రికెట్‌ జిల్లా జట్ల ఎంపిక పోటీలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి క్రికెట్‌ జిల్లా జట్ల ఎంపిక పోటీలు

Sep 30 2026 12:22 AM | Updated on Sep 30 2026 12:22 AM

నగరి : పట్టణలోని కేవీకే డిగ్రీ కళాశాల మైదానంలో బుధవారం నుంచి రెండు రోజులపాటు క్రికెట్‌ జిల్లా జట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. మంగళవారం ఈ మేరకు ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శులు ఎస్‌ఎం లోకనాథం, త్రిలోక సుందరి మాట్లాడుతూ అండర్‌–17, అండర్‌–19 బాలుర క్రికెట్‌ ఎంపిక పోటీలు బుధవారం ఉంటాయన్నారు. బాలికల ఎంపిక పోటీలు గురువారం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 6 నుంచి 12వ తరగతి విద్యార్థులు ఎంపికలకు హాజరుకావచ్చన్నారు. ఆర్గనైజర్‌గా తడుకుపేట జెడ్పీహెచ్‌ఎస్‌ పీడీ ఏఆర్‌ మణి వ్యవహరిస్తారని తెలిపారు. అర్హత గల క్రీడాకారులు తమ ధ్రువీకరణ పత్రాలతో రావాలని సూచించారు.

తిరుమలకు

12 టన్నుల కూరగాయలు

పలమనేరు : తిరుమలలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి పలమనేరుకు చెందిన శ్రీవారి సేవకులు 12 టన్నుల కూరగాయలను వితరణగా అందించారు. మంగళవారం ఈ మేరకు ప్రత్యేక వాహనంలో తిరుమలకు పంపించారు. దాతలను డీఎస్పీ డేగల ప్రభాకర్‌ అభినందించారు. పూసల రవి పాల్గొన్నారు.

ఎఫ్‌ఏ–2 వాయిదాకు డిమాండ్‌

చిత్తూరు కలెక్టరేట్‌:జిల్లాలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు అక్టోబర్‌ 5 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించాల్సిన ఎఫ్‌ఏ–2 పరీక్షలను వాయిదా వేయాలని రాయలసీమ ఉపాధ్యాయుల సంఘం (రూటా) జిల్లా అధ్యక్షుడు మునీర్‌ అహ్మద్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎఫ్‌ఏ–2 పరీక్షలు ముగిసిన వెంటనే అక్టోబర్‌ 11వ తేదీ నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ప్రారంభమవుతుందన్నారు. దీంతో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. ఆగస్ట్‌లో సైతం టెట్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఎఫ్‌ఏ–2 పరీక్షలను వాయిదా వేసిందన్నారు. దీంతో ఉపాధ్యాయులు ప్రశాంతంగా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించారని వెల్లడించారు. దసరా సెలవుల అనంతరం ఎఫ్‌ఏ–2 పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు సైతం సెలవుల సమయంలో సిలబస్‌ను పూర్తిగా రివిజన్‌ చేసుకుని బాగా సిద్ధమవుతారన్నారు. ప్రభుత్వం ఈ విషయాన్ని సానుకూలంగా పరిశీలించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement