రీసర్వేలో యథేచ్ఛగా అక్రమాలు | - | Sakshi
Sakshi News home page

రీసర్వేలో యథేచ్ఛగా అక్రమాలు

Sep 30 2026 12:22 AM | Updated on Sep 30 2026 12:22 AM

– 8లో

పాలసముద్రం మండలం శ్రీకావేరిరాజుపురం పంచాయతీలో చేపట్టిన రీసర్వేలో అక్రమాలపై రైతులు మండిపడుతున్నారు.

సమష్టి కృషితో బాలల హక్కుల రక్షణ

చిత్తూరు కలెక్టరేట్‌ : బాలల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వ శాఖలన్నీ ఒకే లక్ష్యంతో, సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్మన్‌ సూర్యనారాయణరాజు వెల్లడించారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కమిషన్‌ సభ్యులు వెంకట పద్మలత, డీఆర్‌ఓ మోహన్‌ కుమార్‌తో కలిసి అధికారులతో సమీక్షించారు. బాలల సంక్షేమం కేవలం మహిళా శిశు సంక్షేమ శాఖ బాధ్యత మాత్రమే కాదన్నారు. అన్ని శాఖలకూ ఇందులో సమాన భాగస్వామ్యం ఉందని చెప్పారు. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో జిల్లా ఉండడం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామ, వార్డు స్థాయిలో బాలల పరిరక్షణ కమిటీలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్రియాశీలకంగా మారాలని స్పష్టం చేశారు. 0–18 ఏళ్ల పిల్లల సమాచారం, బడి మానేసిన వారి వివరాలు, బాల్య వివాహాల యత్నాలు, బాల కార్మికుల స్థితిగతులపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు. వసతి గృహాల్లో మౌలిక వసతుల కల్పనకు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ తీసుకుంటున్న చర్యలను అభినందించారు. డీఆర్వో మోహన్‌ కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణకు అన్ని శాఖలనూ సమన్వయం చేస్తున్నామని వెల్లడించారు. సీఎస్‌ఆర్‌ నిధులను హాస్టళ్ల అభివృద్ధికి వినియోగిస్తున్నామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement