తిరుపతి ఎడ్యుకేషన్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) వారు మంగళవారం తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆవరణలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అండర్–17, 19 బాలబాలికల జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరచిన బాలబాలికల్లో మొత్తం 20 మందిని జిల్లా జట్లుకు, అలాగే మరికొందరిని స్టాండ్ బై కింద ఎంపిక చేశారు. వీరు అక్టోబరు 1, 2వ తేదీల్లో ఏలూరు జిల్లా, పెదవేగి గురుకుల పాఠశాలలో నిర్వహించే రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్ చెస్ పోటీల్లో పాల్గొంటారని ఎస్‌జీఎఫ్ కార్యదర్శులు సాంబశివరావు, అమ్ములు తెలిపారు. కార్యక్రమంలో చెస్ కోచ్‌లు శివకేశవ, ఆనంద్, వేణు, పీఈటీలు సుబ్రమణ్యంరెడ్డి, కేశవులు, వెంకటేష్, రెడ్డి రాధిక, గోపి, మణి, మురళి పాల్గొన్నారు.


