గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నెలకు కేవలం రూ. 5వేల గౌరవ వేతనంతో పనిచేశాం. అందరికీ తలలో నాలుకలా వ్యవహరించాం. కార్యాలయాల చుట్టూ ఎవరూ తిరగాల్సిన అవసరం లేకుండా మేమే వారి ఇంటికి వెళ్లి సమస్యలు పరిష్కరించచాం. ముఖ్యంగా కోవిడ్ సమయలో మా ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తించాం. మాకు ఇచ్చే రూ.5వేల వృథా అని ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని అప్పట్లో టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. ఇప్పుడు తమ సొంత ప్రచారం కోసం సోషల్ మీడియా కార్యకర్తలకు రూ.లక్షలు దోచిపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇది కాదా ప్రజాధన దుర్వినియోగం.
– వినోద్, మాజీ వలంటీర్, అనంతప్పనాయుడు కండ్రిగ
సొంత డబ్బా కొట్టించుకునేందుకే..
ప్రజలకు సేవ చేస్తున్న వలంటీర్లకు రూ.10 వేలు జీతం ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు మభ్యపెట్టారు. పీఠం ఎక్కిన తర్వాత వలంటీర్ వ్యవస్థనే తీసేశారు. వారికి ఇచ్చే సొమ్ము వృథా అంటూ మా పనులన్నీ సచివాలయ ఉద్యోగులతో చేయించారు. అప్పట్లో ఇంటివద్దకే వెళ్లి అర్హులను గుర్తించి పథకాలు అందించే వాళ్లం. ఇప్పుడు పెన్షన్ కోసం సచివాలయాల వద్ద పడిగాపులు పడే పరిస్థితి ఉంది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారికి రూ.15వేల నుంచి రూ.25వేల వరకు ఇస్తామని చెప్పేది సొంత డబ్బా కొట్టించుకునేందుకే.
– జగదీశ్వరన్, మాజీ వలంటీర్, నగరి


