కుప్పంరూరల్ : రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు కుప్పం డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎంపికై నట్లు కాలేజీ వైస్ చైర్మన్ ఎన్.సాగర్‌రాజ్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ జిల్లాస్థాయి హైజంప్, లాంగ్ జంప్‌లో వి.అర్చన, జావెలిన్ త్రోలో ఎస్.లావణ్య, 100 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందెంలో కె.దర్శిని, 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందెంలో జి.సుచిత్ర, 200 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్‌లో వి.నందిని ఉత్తమ ప్రతిభను కనబరచినట్లు వెల్లడించారు. విద్యార్థినులకు ప్రిన్సిపల్ సుధారాణి, అధ్యాపకులు అభినందనలు తెలిపారు.
రగ్బీ పోటీలకు శశిరేష్మి
పాలసముద్రం : పాలసముద్రం ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎం.శశిరేష్మి రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం మీనాక్షి తెలిపారు. ఈ క్రమంలో విద్యార్థినికి అభినందనలు తెలిపారు.


