ఉద్యానరంగం అభివృద్ధికి హార్టికల్చర్‌ హబ్‌ | - | Sakshi
Sakshi News home page

ఉద్యానరంగం అభివృద్ధికి హార్టికల్చర్‌ హబ్‌

Sep 30 2026 12:16 AM | Updated on Sep 30 2026 12:16 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : రాయలసీమ హార్టికల్చర్‌ హబ్‌తో ఉద్యానరంగం అభివృద్ధి చెందుతుందని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ తెలిపారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాయలసీమ ప్రాంతంలో ఉద్యానవన రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా రూపకల్పన చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం జిల్లాకు రూ.1,529.69 కోట్ల విలువైన ప్రతిపాదనలను కేటాయించారన్నారు. అక్టోబర్‌ 2వ తేదీన మదనపల్లెలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారికంగా ప్రారంభించనున్నారని వివరించారు. జీఓ416 ప్రకారం ప్రణాళికను జిల్లాలోని 27 మండలాల్లో, 20 క్లస్టర్ల పరిధిలో మూడేళ్ల పాటు మూడు విడతలుగా అమలు చేయనున్నట్లు తెలిపారు. మొదటి విడతలో 5 క్లస్టర్లు, 7 మండలాలు, రెండో విడతలో 8 క్లస్టర్లు, 9 మండలాలు, మూడో విడతలో 7 క్లస్టర్లు, 11 మండలాల్లో అభివృద్ధి పనులు చేపడతారన్నారు. రూ.620.40 కోట్లతో బిందు, తుంపర సేద్యపు పరికరాలు అందించనున్నట్లు వెల్లడించారు. రూ.383.74 కోట్లతో విదేశీ పండ్లు, ప్రత్యేక రకాల కూరగాయలు, పూలు, ఆయిల్‌ పామ్‌ సాగును ప్రోత్సహిస్తామన్నారు. రూ.162.80 కోట్లతో పాత తోటల పునరుద్ధరణ, కత్తిరింపులు, సమగ్ర పోషక యాజమాన్య చర్యలు చేపడతారని తెలిపారు. రూ.84.96 కోట్లతో కోల్డ్‌ స్టోరేజీలు, రైపెనింగ్‌ చాంబర్లు, ప్రాసెసింగ్‌ యూనిట్లను నెలకొల్పుతారన్నారు. రూ.77.11 కోట్లతో కలెక్షన్‌ సెంటర్లు, గిడ్డంగులు, ప్యాక్‌ హౌస్‌లు ఏర్పాటు చేస్తారని చెప్పారు. నాణ్యమైన నర్సరీల అభివృద్ధికి రూ.21 కోట్లు, స్టార్టప్‌లు, ఎఫ్‌పీఓల బలోపేతానికి రూ.23 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు రూ.17.21 కోట్లు, రైతులకు శిక్షణకు రూ.17.40 కోట్లు వెచ్చించనున్నట్లు వివరించారు. సాగు నుంచి మార్కెటింగ్‌, ప్రాసెసింగ్‌, ఎగుమతుల వరకు ప్రతి దశలోనూ రైతుకు విలువ ఆధారిత మద్దతు లభించేలా హార్టికల్చర్‌ హబ్‌ తోడ్పడుతుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement