తవణంపల్లె : వుండలంలోని తొడతర ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోసాధ్యాయుడు ఖాతుంబీ తెలిపారు. తిరుపతిలోని తుమ్మలగుంట కేవీఎస్ గ్రౌండ్‌లో చిత్తూరు జిల్లా అథ్లెటిక్ అసోషియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పోటీలను నిర్వహించారు. అండర్–14 విభాగం ట్రయాథ్లాన్ పోటీల్లో ఎన్.ధనుష్, అండర్–16 విభాగం పెంటాథ్లాన్ పోటీల్లో డి.ముకేష్‌కుమార్, అండర్–18 విభాగం డిస్కస్ త్రో పోటీలో బి.లోకేష్ ప్రతిభ కనపరచారని వెల్లడించారు. మంగళవారం ఈ మేరకు విద్యార్థులను అభినందించారు.


