పేపర్ ప్లేట్లలో వేడి ఆహారం పెట్టుకుని తినడంతో కెమికల్ ఎఫెక్ట్ జరుగుతుంది. ఇది మన శరీరంలోకి చేరడంతో ముఖ్యంగా నెర్వస్ సిస్టమ్‌పై ప్రభావం పడుతుంది. ఆపై లివర్, కిడ్నీ, గుండె, స్ట్రెస్, పలు రకాల క్యాన్సర్లు సోకే అవకాశాలున్నాయి. ముఖ్యంగా మహిళలల్లో హార్మోన్ల ఇన్‌బ్యాలెన్స్‌తో ఫెర్టిలిటీ సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. – మమతారాణి,
సూపరిండెంటెంట్, ఏరియా ఆస్పత్రి, పలమనేరు
పెను ప్రమాదం తప్పదు
ఇటీవల పేపర్‌ప్లేట్ల వినియోగం ఎక్కువైంది. ఎటు చూసినా అవే కనిపిస్తున్నాయి. వీటి వాడకంతో మనకు తెలియకుండానే ఎన్నో రకాల వ్యాధులను మనమే శరీరంలోకి ఎక్కించుకుంటున్నాం. వీటికి ప్రత్యామ్నాయంగా స్టీల్, మట్టి, పింగాణి ప్లేట్లను రీయూజ్‌గా వాడుకునే విధానాలకు జనం అలవాటు పడాలి. దీనిపై ముఖ్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రజల ఆరోగ్య రక్షణ బాధ్యత పాలకులపై ఉంది. – సోమచంద్రారెడ్డి,
మేధావుల ఫోరమ్ జిల్లా అధ్యక్షుడు


