– ఇద్దరి అరెస్ట్
పాలసముద్రం : తమిళనాడు రేషన్ బియ్యం తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం బలిజకండ్రిగ– చిత్తూరు జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేపట్టగా దీనబంపురం క్రాస్ వద్ద టాటా సుమోలో ఇద్దరు వ్యక్తులు తమిళనాడు బియ్యం తీసుకెళుతున్నట్లు గుర్తించామన్నారు. గుర్తించారు. నిందితులను విచారించగా ఇందిరానగర్ సమీపంలో కె.రాజా అనే వ్యక్తి గుడిసెలో 51 బస్తాల తమిళనాడు రేషన్ బియ్యం పట్టుబడిందని వెల్లడించారు. నిందితులు తమిళనాడుకు చెందిన ఆర్.బాలాజీ(40), ఎమ్ ఆశోక్ (36)గా గుర్తించామన్నారు. మరో నిందితుడు రాజా పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే నిందితుల నుంచి రూ3లక్షల విలు వైన వాహనం, రూ.లక్ష విలువైన బియ్యం సీజ్ చేసినట్లు వివరించారు. ఈ మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
మళ్లీ ప్రోటోకాల్ రగడ
సాక్షి టాస్క్‌ఫోర్స్ : పెద్దపంజాణి మండలంలో ఆగస్టు 1వ తేదీన పెద్దకాప్పల్లె సీసీ రోడ్డు ప్రారంభోత్సవం ఉంది. ఈ మేరకు ఆవిష్కరించాల్సిన శిలాఫలకంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులు కోడిపల్లి పావని పేరు రాయలేదు. టీడీపీ నేతల మెప్పుకోసం బీసీ మహిళ అని కూడా చూడకుండా శిలాఫలకంలో ఆమె పేరును కేవలం శ్రీగారు అని పెట్టి అవమానించారు. ప్రోటోకాల్ పాటించాల్సిన అధికారులే కావాలనే ఇలా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పొగాకు తరలిస్తున్న
వ్యక్తి అరెస్ట్
పుత్తూరు : రైలులో అక్రమంగా పొగాకును తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పుత్తూరు ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ కేపీ సెబాస్టియన్ తెలిపారు నిందితుడి నుంచి రూ.9వేల విలువైన కేజీ పొగాను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వివరాలు.. ఆర్‌పీఎఫ్ ఎస్‌ఐ విజయ్‌నాయక్, ఏఎస్‌ఐ రవిచంద్రన్ బృందం మంగళవారం తిరుపతి నుంచి చైన్నె వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.. విచారణలో బీహార్ రాష్ట్రానికి చెందిన ఫహద్(28) వ్యక్తిగా గుర్తించారు. పట్టుబడిన పొగాకును తిరుత్తణికి చెందిన ఆహార భద్రతాధికారికి స్వాధీనపరిచినట్లు రైల్వేపోలీసులు తెలిపారు. ఆహార భద్రత, ఔషధ పరిపాలన శాఖ అధికారులు ఈ మేరకు నిందితుడికి రూ.25 వేల జరిమానా విధించినట్లు వెల్లడించారు.
చికిత్సపొందుతూ
యువకుడి మృతి
పూతలపట్టు(యాదమరి) : ఆర్‌వీఎస్ నగర్ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు చికిత్సపొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. వివరాలు.. తవణంపల్లె మండలం పొందేటిపల్లెకు చెందిన రంజాన్ పూతలపట్టులో ఓ చికెన్ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో చిత్తూరులో జరిగిన ఉరుసు ఉత్సవంలో పాల్గొని ఇంటికి బైక్‌పై వస్తుండగా డివైడర్‌ను ఢీకొన్నాడు. స్థానికులు వెంటనే 108లో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మరణించాడు. రంజాన్‌కు ఆరు నెలల క్రితమే వివాహమైంది. పెళ్లయిన కొద్దిరోజులకే మృత్యువాత పడడంతో భార్య, కుటుంబీకులు విషాదంలో మునిగిపోయారు.
నేటి నుంచి
జాతీయ సదస్సు
తిరుపతి సిటీ: ఎస్వీ ఆర్ట్స్ కళాశాల రసాయనశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ, హరిత రసాయన శాస్త్రం, స్థిరమైన రసాయన సమ్మేళనాల సంశ్లేషణ, నూతన పరిశోధనలు అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ఎన్.వేణుగోపాల్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం నుంచి రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు దేశ నలుమూలల నుంచి ప్రముఖ శాస్త్ర వేత్తలు, అధ్యాపకులు, పరిశోధకులు హాజరై పరిశోధన పత్రాలు సమర్పిస్తారని తెలిపారు. టీటీడీ జేఈవోలతో పాటు, డీఈఓ ప్రారంభ కార్యక్రమానికి హాజరవుతారని పేర్కొన్నారు.


