శనివారం పోలింగ్ కేంద్రాల్లో
అందుబాటులోని బీఎల్వోలు
ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాల
స్వీకరణలో వైఫల్యం
తికమకలో జిల్లా ఓటర్లు
క్షేత్రస్థాయిలో పర్యటించని ఆర్‌డీవో, తహసీల్దార్లు
నీరుగారుతున్న సర్ ప్రక్రియ
సాక్షి టాస్క్‌ఫోర్స్ : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నేపథ్యంలో శని, ఆదివారాల్లో బీఎల్వోలు స్థానిక పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 1 గంట వరకు అందుబాటులో ఉండాలని స్పష్టమై న ఆదేశాలు జారీచేశారు. అయితే జిల్లాలో శని వారం ప్రత్యేక డ్రైవ్ కాగితాలకే పరిమితమైంది. పోలింగ్ కేంద్రాల్లో బీఎల్వోల జాడ కనిపించలేదు. చాలావరకు పోలింగ్ కేంద్రాలు వెలవెలబోయాయి.
తికమకలో ఓటర్లు
ఉన్నతాధికారుల ఆదేశాలను నమ్మి శనివారం పనులు మానుకుని వచ్చిన ఓటర్లు తీవ్ర గందరగోళానికి లోనయ్యారు. ఏ కేంద్రంలో ఎవరు ఉంటారు? ఎవరిని సంప్రదించాలి? అనే కనీస సమాచారం కూడా ఎక్కడా ప్రదర్శించని దుస్థితి. దీంతో జిల్లాలోని అధికారుల బాధ్యతరాహిత్యానికి అద్దం పడుతోంది.
ఏసీ రూమ్‌లకే పరిమితం
బీఎల్వోలు కేంద్రాల్లో అందుబాటులో ఉన్నారా, లేదా? క్షేత్ర స్థాయిలో ఏం చేస్తున్నారు? అని పర్యవేక్షించాల్సిన బాధ్యత స్థానిక తహసీల్దార్, డివిజన్ స్థాయి లో ఆర్‌డీవోలదే. కానీ, శనివారం ఆ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించిన దాఖలాలు లేవు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో బీఎల్వోలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. పై అధికారులు అడగరు.. మనల్ని చూసేవారెవెరు ? అనే ధీమాతోనే విధులకు డుమ్మా కొట్టారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సెలువు పెట్టి వెళ్లా
కొత్త ఓటు కోసం దరఖాస్తు చేద్దామని శనివారం కార్యాలయానికి సెలవు పెట్టి మా పోలింగ్ కేంద్రానికి వెళ్లాను. అక్కడ చూస్తే పాఠశాల నిర్వహిస్తున్నారు. పాఠశాలలో వెళ్లి మొత్తం తిరిగి చూశాను. బీఎల్వోలు ఎవరూ లేరు. అక్కడున్న బీఎల్వో సెల్ నెంబర్‌కు ఫోన్‌చేశాను. ఇప్పుడు బీఎల్వో నేను కాదు. వేరే వాళ్లు అని సమాధానమిచ్చారు. పెద్ద పెద్ద ప్రకటనలు ఇవ్వడం ఎందుకు? ఇక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు?
– సతీష్ కుమార్, స్థానికుడు,
చిత్తూరు నగరం.
కేవలం ప్రకటనలకే
పరిమితం
పరిశీలించిన అంశం క్షేతస్థాయి పరిశీలన ప్రభావం
బీఎల్వోల హాజరు శనివారం 70 శాతం కేంద్రాల్లో ఫారాలు సమర్పించకుం అందుబాటులో లేరు డానే ఓటర్లు వెనుదిరి గారు.
ఆర్డీవో, తహసీల్దార్ల పర్యటన క్షేత్రస్థాయిలో కేంద్రాలను బీఎల్వోలలో భయం సందర్శించలేదు లేకపోవడానికి ఇదే
ప్రధాన కారణం
కేంద్రాల నిర్వహణ పోలింగ్ కేంద్రాల్లో వృద్ధులు, మహిళలు
ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. నిరీక్షించి ఇబ్బందులు ఎదుర్కున్నారు


