హెల్ప్‌ డెస్క్‌ పరిశీలించిన భూమన | - | Sakshi
Sakshi News home page

హెల్ప్‌ డెస్క్‌ పరిశీలించిన భూమన

Jul 5 2026 3:00 AM | Updated on Jul 5 2026 3:00 AM

చిత్తూరు కార్పొరేషన్‌: నగరంలోని జానకారపల్లెలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఏర్పాటు చేసిన హెల్ప్‌ డెస్క్‌ను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి శనివారం పరిశీలించారు. డివిజన్‌ పరిధిలో జరుగుతున్న ఎన్యూమరేషన్‌ ఫారాల పంపీణీ, నమోదు, అందజేత, డిజిటలైజేషన్‌ వివరాలను చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి భూమనకు తెలియజేశారు. బీఎల్‌ఎల పనితీరు, ఫారాలు రాయడానికి వారు అందిస్తున్న సహకారం గురించి మాట్లాడారు. అలాగే నియోజకవర్గంలో జరుగుతున్న ఓటర్ల సర్వే పనితీరును తెలియజేశారు. పలువురు ఓటర్లు హెల్ప్‌ డెస్క్‌ వద్ద ఫారాలపై సందేహాలను తెలుసుకున్నారు. బీఎల్‌ఎలు ఫారాలు రాసి ఇచ్చారు. కార్యక్రమంలో చిత్తూరు నియోజకవర్గ బూత్‌ కమిటీ అధ్యక్షుడు మధురెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సరళామేరీ, మాజీ కార్పొరేటర్‌ లక్ష్మణస్వామి నాయకులు అన్బు, అంజలిరెడ్డి, ఆను, మురళీరెడ్డి, నౌషద్‌, హరీషారెడ్డి, రాజశేఖర్‌, మనోజ్‌రెడ్డి, సీతాపతి, ఇమ్రాన్‌, కౌసర్‌, ప్రేమ్‌, అల్తాఫ్‌, సద్దాం తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థి ఖాతా తప్పనిసరి

చిత్తూరు కలెక్టరేట్‌ : ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్న అర్హత కలిగిన ఎస్సీ విద్యార్థులు తప్పనిసరిగా తమ పేరుతో బ్యాంకులో గానీ లేదా తపాలా బ్యాంకులో కొత్త ఖాతా తెరవాలని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ఆదేశించారు. 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం పథకా న్ని ఈ నెలలోఅమలు చేయనున్నట్లు పేర్కొ న్నారు. విద్యార్థి పేరుతో తెరిచిన ఖాతాను తప్పనిసరిగా ఎన్‌పీసీఐతో అనుసంధానం చేయాలన్నారు. అలా చేసిన వారికి మాత్రమే తల్లికి వందనం పథకం ఆర్థిక ప్రయోజనాలు అందుతాయన్నారు. ఈ ప్రక్రియను ఈ నెల 10 వ తేదేలోపు పూర్తి చేయాలని సూచించారు. ఇంటర్‌ కళాశాలల యాజమాన్యాలు, సచివాల య సిబ్బంది చొరవ తీసుకుని అర్హులైన విద్యార్థులతో వారి పేరు మీద కొత్త ఖాతాలు తెరిపించి, ఎన్‌పీసీఐ అనుసంధానం పూర్తయ్యేలా అవసరమైన మార్గదర్శకాలు అందించాలని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement