తమిళనాడు సరిహద్దు వరకు బారులు తీరిన మామిడి ట్రాక్టర్లు | - | Sakshi
Sakshi News home page

తమిళనాడు సరిహద్దు వరకు బారులు తీరిన మామిడి ట్రాక్టర్లు

Jul 5 2026 3:00 AM | Updated on Jul 5 2026 3:00 AM

తమిళనాడు సరిహద్దు వరకు బారులు తీరిన

మామిడికాయల ట్రాక్టర్లు

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

పెద్దపంజాణి: మండలంలోని బసవరాజుకండ్రిగ గ్రామంలో అనుమానాస్పదంగా సీతారామయ్య(40) అనే వ్యక్తి మృతిచెందిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బసవరాజుకండ్రిగ గ్రామానికి చెందిన శ్రీరాములు కుమారుడు సీతారామయ్య అదే గ్రామానికి చెందిన భాగ్యమ్మను 15ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కూలి పనులు చేసుకుంటూ సీతారామయ్య కుటుంబాన్ని పోషించేవాడు. 10 రోజులుగా భార్య మామ నాగరాజు ఇంట్లో సీతారాయమ్మ కుటుంబసభ్యులతో కలసి ఉంటున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సీతారామయ్య కుటుంబంతో కలసి భోజనం చేసి పెద్దపంజాణి వెళ్లి వస్తానని వెళ్లాడు. అయితే శనివారం ఉదయం ఇంటి ముందు శవమై కనిపించాడు. అప్పటికే మృతి చెందిన సీతారామయ్య గొంతుకు చీర చుట్టుకుని ఉండడాన్ని గుర్తించి గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. సీతారామయ్య ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ఎవరైనా హత్య చేశారా.. అనే విషయాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement