– డిప్యూటీ కలెక్టర్
విజయకుమారి
బంగారుపాళెం: ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను బీఎల్‌వోలు వేగవంతంగా నిర్వహించాలని డిప్యూటీ కలెక్టర్ విజయకుమారి ఆదేశించారు. శుక్రవారం మండలంలోని జంబువారిపల్లె, తగ్గువారిపల్లె, బంగారుపాళెం, వేపనపల్లె పంచాయతీలలో నిర్వహిస్తున్న సర్ కార్యక్రమాన్ని ఆమె పర్యవేక్షించారు. సర్ కార్యక్రమం గురించి బీఎల్‌వోలను అడిగి తెలుసుకున్నారు. ఏన్యూమరేషన్ ఫారాల పంపిణీ, నమోదు, డిజిటలేషన్ తీరుపై ఆరా తీశారు. డిజిటలేషన్‌లో వెనుకబడి ఉండడంపై బీఎల్‌వోలపై ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావాలన్నదే ‘ససర్’ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. అనర్హులు, మృతులు శాశ్వత వలసదారులు, ఒకటికి మించి ఎక్కువ ఓట్లు ఉన్నవారిని గుర్తించి తొలగించాలన్నారు. ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ పూర్తి స్థాయిలో జరగాలన్నారు. ఓటర్ల నుంచి తీసుకున్న ఎన్యూమరేషన్ ఫారాల వివరాలను డిజిటలేజేషన్‌ను ఎప్పటి కప్పుడు పూర్తిచేయాల్సిన బాధ్యత బీఎల్‌వోలపై ఉందని గుర్తించుకోవాలన్నారు. సర్ కార్యక్రమంపై నిర్లక్ష్యంగా వ్యవహరించే బీఎల్‌వోలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్వేయర్ లావణ్య పాల్గొన్నారు.


