అవ్వాతాతల పేర్లు అడుగుతున్నారు | - | Sakshi
Sakshi News home page

అవ్వాతాతల పేర్లు అడుగుతున్నారు

Jul 4 2026 12:32 AM | Updated on Jul 4 2026 12:32 AM

ఇతని పేరు సి.వాసు. తిరుపతి చెన్నారెడ్డి కాలనీ, మారుతీనగర్‌, డోర్‌ నం.6–11–211లోని అద్దె గృహంలో నివాసం ఉంటున్నారు. భార్య లేదు. తల్లి, మైనర్‌ బాలుడుతో కలసి ఉంటున్నారు. వృత్తి రీత్యా అలిపిరి మెట్ల వద్ద చిన్న పాటి వ్యాపారం చేసుకుంటున్నారు. కాగా సర్‌ కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటి వద్దకు జూన్‌ మూడో వారంలో ఓటరు ప్రత్యేక సవరణలో భాగంగా ఆ ప్రాంత బీఎల్‌వో, స్వర్ణ వార్డు సిబ్బంది ఎన్యూమరేషన్‌ ఫారాలను ఇచ్చారు. వాటిని కొన్ని షరుతులకు అనుగుణంగా పూరించాలి. 2002లో ఓటరు జాబితాలో పేరు లేదని నాన్న లేదా తాత, అవ్వల పేర్లు, వారు లేని పక్షంలో మరణ ధృవీకరణ పత్రాలను ఇవ్వాలని చెప్పారు. నాన్న పేరు గుర్తుందని, తాత, అవ్వల పేర్లు తెలివని చెప్పారు. ఇచ్చిన రెండు రెన్యూమరేషన్‌ ఫారాలను పూరించి రెండు ఫొటోలను అందించారు. ఇప్పటికి పదిహేను రోజులు దాటినా తాత, అవ్వల పేర్లు చెప్పాలని బీఎల్‌వో అడుగుతూనే ఉన్నారని చెబుతున్నారు. ఇంతకీ ఈ సవరణలో తమ ఓట్లు ఉంటాయా లేదా అనే అనుమానం వస్తోందని వాసు ఆవేదన చెందుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement