తోతాపురి కొనుగోళ్లను నిలిపివేసిన ఫ్యాక్టరీల యజమానులు, ఇప్పుడు వ్యూహాత్మకంగా ‘నీలం రకం మామిడి కాయలు కొంటాం’ అంటూ బోర్డులు తగిలించారు. అది కూడా కేవలం కేజీ రూ.6 లకే కొంటామని తెగేసి చెబుతున్నారు. కనీసం కోత కూలీలు, రవాణా ఖర్చులు కూడా రాని ఈ ధరతో రైతులను మరింత శ్రమ దోపిడీ చేసేందుకు యాజమాన్యాలు సిద్ధపడ్డాయి. మరోవైపు గుడిపాల పరిసరాల్లోని ఫ్యాక్టరీలు అరకొరగా కొనుగోళ్లు జరుపుతూ.. పక్కనే ఉన్న తమిళనాడు కాయలపై మోజు చూపిస్తూ స్థానిక రైతులను నట్టేట ముంచుతున్నాయి.


