తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ కృష్ణ తేజ అతిథి గృహం వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 66,304 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 31,811 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.89 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.
టీబీ నిర్మూలనపై సమీక్ష
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లా క్షయవ్యాధి నియంత్రణ కార్యాలయంలో జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం అమలుపై శుక్రవారం జిల్లాస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డబ్ల్యూహెచ్‌ఓ రాష్ట్ర కన్సల్టెంట్ డాక్టర్ అరుత్ సెల్వన్ ముఖ్య అతిథిగా హాజరై టీబీ కేసుల గుర్తింపు, సేవల నాణ్యత, చికిత్స ఫలితాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా డీఎల్‌ఏటీఓ జి.వెంకట ప్రసాద్ జిల్లాలో కార్యక్రమ ప్రగతిని వివరించా రు. అనంతరం డాక్టర్ అరుత్ సెల్వన్ మాట్లాడుతూ.. 2030 నాటికి క్షయ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. బాధితులను త్వరితగతిన గుర్తించి నిరంతర చికిత్స అందించడంతో పాటు ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. ఈ సమావేశంలో డీపీసీ, డీపీఎస్, పీపీఎం కోఆర్డినేటర్లు, ఎన్‌టీఈపీ సిబ్బంది పాల్గొన్నారు.
మిస్భా తండ్రి ఆత్మహత్య
పలమనేరు: గతంలో పలమనేరులో కాపురముంటూ పుంగనూరుకు వెళ్ళిన మిస్భా తండ్రి వజీర్ అహ్మద్(50) రెండ్రోజుల క్రితం అక్కడి కొత్తపేటలోని తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. 2022లో పలమనేరులో మిస్భా అనే బాలిక ఇంట్లో ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగాక మిస్భా కుటుంబం పుంగనూరుకు వెళ్ళిపోయింది. ఏం జరిగిందోగాని మిస్భా తండ్రి సైతం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం పలమనేరులో చర్చనీయాంశమైంది.
విద్యుదాఘాతంతో
వృద్ధుడి మృతి
గంగవరం: కూలి పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మిద్దైపె నుంచి కింద పడ్డ వృద్ధుడు మృతి చెందిన ఘటన మండలంలో శుక్రువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గంగవరం మండల కేంద్రంలోని శ్రీలంక కాలనీలో నివాసం ఉంటున్న మహదేవ(65)కు కూలి పనులే జీవనాధారం. గురువారం డ్రైవర్స్ కాలనీ వద్ద కూలి పనులకు వెళ్ళాడు. ఇంటి మిద్దైపె పనిచేస్తుండగా ప్రమా దవశాత్తు పక్కనే ఉన్న విద్యుత్ తీగలు తగిలి షాక్‌కు గురై మిద్దైపె నుంచి కిందికి పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వృద్ధుడిని హుటాహుటిన పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం చైన్నెకి రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రువారం మృతిచెందాడు. పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


