చిత్తూరు కార్పొరేషన్: ట్రాన్స్‌కో జిల్లా నోడల్ ఆఫీసర్, సీజీఎం శోభావాలంటీనా నగరంలో శుక్రవారం పర్యటించారు. కొంగారెడ్డిపల్లె సెక్షన్‌లోని సాయిబాబా ఫీడర్‌ను పరిశీలించారు. ఎనర్జీ ఆడిట్‌లో భాగంగా స్మార్ట్ మీటర్ల సరఫరాను అడిగి తెలుసుకున్నారు. ఎంత సరఫరా చేస్తున్నారు. అందుకు తగిన బిల్లులు వస్తోందని అని పరిశీలించారు. విద్యుత్ లాస్ వివరాలను తదితర విషయాలను తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ట్రాన్స్‌ఫార్మర్లు, సర్వీసుల పనితీరును గమనించారు. అనంతరం సెక్షన్‌లో సిబ్బందితో మాట్లాడారు. కార్యక్రమంలో ఈఈ మునిచంద్ర, డీఈ ప్రసాద్, ఏఈ రాము, సిబ్బంది పాల్గొన్నారు.
టీటీడీకి రూ.50.2 లక్షల విరాళం
తిరుమల: తమిళనాడుకు చెందిన కేకేఎస్ కన్‌స్ట్రక్షన్ సంస్థ శుక్రవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.50.2 లక్షలు విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్యచౌదరికి విరాళం డీడీని అందజేశారు.
టీటీడీకి రూ.10 లక్షల విరాళం
చిత్తూరుకు చెందిన సురేష్‌కుమార్ టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాత టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు. అలాగే చిలకలూరిపేటకు చెందిన చుండి రంగ నాయకులు టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.


