వైభవంగా సంకటహర గణపతి వ్రతం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా సంకటహర గణపతి వ్రతం

Jul 4 2026 12:32 AM | Updated on Jul 4 2026 12:32 AM

కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం ఆస్థాన మండపంలో శుక్రవారం సంకటహర గణపతి వ్రతాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తుల రద్దీని దృష్టిలోఉంచుకుని ఉదయం, సాయంత్రం వేళల్లో మొత్తం నాలుగు బ్యాచ్‌లుగా ఈ వ్రతాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు స్వామివారికి ప్రత్యే క పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే రాత్రి స్వామి వారిని స్వర్ణ రథంలో ఊరేగించారు. ఊరేగింపుగా వస్తున్న స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. అడుగడుగునా కర్పూర హారతులు పట్టి మొక్కులు చెల్లించుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement