అయోమయం.. గందరగోళం! | - | Sakshi
Sakshi News home page

అయోమయం.. గందరగోళం!

Jul 3 2026 1:16 AM | Updated on Jul 3 2026 1:16 AM

● టీటీడీ జూనియర్‌ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియపై విమర్శలు ● నాల్గోవిడత పూర్తయినా భర్తీకాని సీట్లు ● నరకం చూపిస్తున్నారంటూ తల్లిదండ్రుల ఆవేదన

తిరుపతి సిటీ: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న జూనియర్‌ కళాశాలల్లో అధికారులు చేపట్టిన అడ్మిషన్ల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. 2026–27 విద్యాసంవత్సరం ప్రారంభమై నెలరోజులు గడుస్తున్నా అధికారులు అడ్మిషన్ల ప్రక్రియను సాగదీస్తూ నరకం చూపిస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడ్మిషన్ల ప్రక్రియ సాధారణంగా రెండు విడతలు పూర్తి చేసి మిగిలిన సీట్లకు స్పాట్‌ అడ్మిషన్లతో భర్తీ చేసే సంప్రదాయం ఇప్పటి వరకు కొనసాగేది. అలాంటిది ఈ ఏడాది విచిత్రమైన రీతిలో ఇటు విద్యార్థులకు, అటు తల్లిదండ్రులకు చుక్కలు చూపుతూ నాలుగు విడతల కౌన్సెలింగ్‌ ప్రక్రియను గురువారానికి పూర్తి చేశారు. అయినా ఇప్పటికీ ఎస్వీ జూనియర్‌ కళాశాలలో 50 శాతం సీట్లు భర్తీ కాలేదు. పద్మావతి జూనియర్‌ కళాశాలలో 70 శాతం సీట్లు భర్తీ అయినట్లు తెలుసుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నిబంధనలు పెట్డం వల్లే ఈ పరిస్థితి నెలకొన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఐదో విడత ఉంటుందా?

టీటీడీ జూనియర్‌ కళాశాలల్లో అడ్మిషన్ల పరిస్థితి అయోమయంగా తయారైంది. నాలుగు విడతల అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టి విమర్శలు ఎదుర్కొంటున్న అధికారులు మిగిలిన సీట్ల భర్తీ కోసం ఐదో విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియను కొనసాగిస్తారా..? లేక స్పాట్‌ అడ్మిషన్లకు వెళతారా అనే సందేహం వ్యక్తమవుతోంది. సీట్ల కోసం వ్యవ ప్రయాసల కోర్చి కళాశాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్న తల్లిదండ్రుల ఆవేదనను అధికారులు దృష్టిలో ఉంచుకుని స్పాట్‌ అడ్మిషన్లు చేపట్టాలని కోరుతున్నారు.

ప్రవేశాల ఎస్వీ పద్మావతి

ప్రక్రియ జూనియర్‌ జూనియర్‌

కళాశాల కళాశాల

తొలివిడతలో 172 252

రెండో విడతలో 103 191

మూడో విడతలో 81 128

నాల్గో విడతలో 140 45

మొత్తం సీట్ల సంఖ్య 968 792

ఇప్పటివరకు భర్తీఅయిన సీట్లు 401 711

మిగిలిన సీట్ల సంఖ్య 391 257

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement